భౌతికశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్
Sakshi Education
భౌతికశాస్త్రంలో విశేష పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలను నోబెల్ పురస్కారం-2019 వరించింది.
కెనడియన్ అమెరికన్ అయిన జేమ్స్ పీబుల్స్, స్విట్జర్లాండ్‌కు చెందిన మైఖేల్ మేయర్, డిడియర్ క్యులోజ్‌లకు ఈ పురస్కారాన్ని ఉమ్మడిగా అందజేయనున్నట్టు నోబెల్ అసెంబ్లీ అక్టోబర్ 8న ప్రకటించింది. మొత్తం ప్రైజ్‌మనీ అయిన 9.18 లక్షల అమెరికన్ డాలర్లలో సగం పీబుల్స్‌కు, మిగతా సగాన్ని మైఖేల్, క్యులోజ్‌కు అందజేయనున్నట్లు తెలిపింది. విశ్వసృష్ట్టిలో సైద్ధాంతిక ఆవిష్కరణలతో పాటు సూర్యుడిని పోలిఉండే నక్షత్రం చుట్టూ తిరిగే గ్రహం కనుగొన్నందున ఈ ముగ్గిరికి నోబెల్ దక్కింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భౌతికశాస్త్రంలో నోబెల్ పురస్కారం-2019 విజేతలు
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎవరు : జేమ్స్ పీబుల్స్, మైఖేల్ మేయర్, డిడియర్ క్యులోజ్
ఎందుకు : విశ్వసృష్ట్టిలో సైద్ధాంతిక ఆవిష్కరణలతో పాటు సూర్యుడిని పోలిఉండే నక్షత్రం చుట్టూ తిరిగే గ్రహం కనుగొన్నందున

Published date : 09 Oct 2019 06:13PM