రెండో తరం సంస్కరణలు.. వృద్ధికి ఊతమిస్తాయా?
Sakshi Education
దేశ ఆర్థిక వ్యవస్థలో మరోసారి సంస్కరణల పర్వానికి తెర లేచింది. మొదటి తరం సంస్కరణల ద్వారా ఆశించిన లక్ష్యాలను చేరకపోవడం.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యవస్థ పురోగతికి రెండో దశ సంస్కరణలు ఊతమిస్తాయని ఐఎంఎఫ్ నివేదించడం మొదలైన కారణాల వల్ల రెండోతరం సంస్కరణలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘ దేశ ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటోంది.. సంస్కరణలు అవసరం’ అని స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన నేపథ్యంలో రెండో తరం సంస్కరణలుగా పేర్కొంటున్న పలు అంశాలపై విశ్లేషణ..
మొదటి తరం ఆర్థిక సంస్కరణలు పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనాన్ని అందించని నేపథ్యంలో రెండోదశ ఆర్థిక సంస్కరణలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మొదటిదశ సంస్కరణల ఫలితాలు, లోపాలు పరిశీలించాక సంస్కరణల ప్రక్రియను సంస్కరించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
భారత్ వృద్ధి వ్యూహంలో తీసుకురావలసిన మార్పును రెండో దశ సంస్కరణలు సూచిస్తున్నాయి. సాంఘిక న్యాయంతో కూడిన వృద్ధి ప్రధాన ధ్యేయంగా రెండో దశ సంస్కరణలు రూపు దిద్దుకున్నాయి.
ఈ సంస్కరణల తత్వాన్ని పరిశీలిస్తే.. పేద వర్గాల ప్రజల్లో ఉపాధిని పెంపొందించి వారి జీవన ప్రమాణాన్ని పెంచే క్రమంలో వృద్ధి ఓ యంత్రంగా ఉండాలనేది సారాంసం. సుస్థిర బ్రాడ్ బేస్డ్ గ్రోత్, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అమలు, రోడ్ల నిర్మాణం, గృహ నిర్మాణాన్ని ప్రోత్సహించడం, నాలెడ్జ్ ఆధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం, మానవ వనరుల నాణ్యతని పెంపొందించడం లక్ష్యాలుగా ఉపాధి మెరుగుపడుతుందని సంస్కరణలు సూచిస్తున్నాయి.
ఐఎంఎఫ్ అభిప్రాయం:
ప్రపంచీకరణ నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వృద్ధి మెరుగవడానికి రెండో దశ సంస్కరణలు ఉపకరిస్తాయని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మొదటి దశ సంస్కరణల అమలు కాలంలో సామాజిక ప్రగతి కొరవడి ప్రపంచ మార్కెట్‌లో ఆయా దేశాల పోటీతత్వం ఆశించిన స్థాయిలో పెరగలేదని ఐఎంఎఫ్ మాజీ మేనేజింగ్ డెరైక్టర్ మైకెల్ కామ్‌డెసెస్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ కార్యకలాపాలలో పారదర్శకత పెంపు, జ్యుడీషియల్ సంస్కరణలు, సంపద హక్కు అమలు అనేవి రెండోదశ సంస్కరణల్లో పెంపొందించాలని ఐఎంఫ్ పేర్కొంది. ప్రపంచ సుస్థిరతకు ఏర్పడుతున్న అవరోధాలను అధిగమించడానికి ఆసియా దేశాల సంక్షోభం ప్రారంభానికి ముందు ఐఎంఎఫ్ 1996లో మధ్యంతర కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రూపొందించిన దస్త్రంలో ప్రధానాంశాలుగా వృద్ధిని సాధించే క్రమంలో అవసరమైన నియమావళి, పటిష్ట స్థూల ఆర్థిక విధానాలు, నిర్మాణాత్మక మార్పుల్ని పేర్కొన్నారు. వీటినే రెండోతరం ఆర్థిక సంస్కరణలుగా పేర్కొనవచ్చు. వివిధ రంగాల మధ్య వనరుల కేటాయింపు, గుడ్ గవర్నెన్స్, సంస్థాగత మార్పులు, పోటీ విధానంపై కఠిన నిర్ణయాలు, శ్రామిక విధానం, పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ అనేవి రెండో దశ ఆర్థిక సంస్కరణల్లో లక్షిత అంశాలుగా జీడీపీ 8 నుంచి 9 శాతం వృద్ధి సాధించడం, రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో రాష్ట్రాల మధ్య అసమానతలు తొలగింపు అనేవి రెండోదశ ఆర్థిక సంస్కరణల ప్రధాన లక్ష్యాలుగా రూపుదిద్దుకున్నాయి.
మెదటి, రెండో దశ ఆర్థిక సంస్కరణల మధ్య సామీప్యత
ద్రవ్యోల్బణం తగ్గింపు, రక్షిత విధానాలు నిలిపివేత, స్థూల ఆర్థిక విధానాలలో మార్పు, స్థిరమైన వృద్ధి అనేవి మొదటి దశ ఆర్థిక సంస్కరణల్లో ప్రాధాన్యతాంశాలు. సాంఘిక పరిస్థితుల మెరుగుదల, అంతర్జాతీయంగా పోటీతత్వం పెంపొందించడం, స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడం, ప్రైవేట్ రంగంలో పోటీ తత్వాన్ని పెంపొందించడం అనేవి రెండో దశ ఆర్థిక సంస్కరణల ప్రాధాన్యతాంశాలు. మొదటి దశ సంస్కరణల్లో లక్ష్యాలను సాధించే క్రమంలో ప్రభుత్వ పరిధి తగ్గింపు, పన్నుల సంస్కరణలు, వాణిజ్యం, విదేశీ పెట్టుబడి, డ్రాస్టిక్ బడ్జెట్ కట్స్ లాంటి వ్యూహాలను అవలంబించగా... ఉత్పత్తి, ఫైనాన్సింగ్, విద్య, ఆరోగ్య సర్వీసుల అమలులో సంస్కరణలు, శ్రామిక మార్కెట్ సంస్కరణలు, ప్రభుత్వ పాత్రను పునర్నిర్వచించడం వంటి వ్యూహాలతో రెండోదశ సంస్కరణల లక్ష్యాల సాధనను రూపొందించారు.
ఆర్థిక సంస్కరణలపై ఆర్థిక వేత్తల అభిప్రాయాలు:
భారత్ ఆర్థిక ప్రాధాన్యతలను తప్పనిసరిగా మార్పు చేసుకోవాలని, వాటిని కమ్యూనిటీ సంబంధితం కాకుండా, ప్రజా సంబంధితంగా రూపొందించాలని ఆర్థికవేత్త అమర్త్యసేన్ అభిప్రాయ పడ్డారు. సామాజికాభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చే విధంగా రెండో దశ సంస్కరణలు అవసరమని ఆయన పేర్కొన్నారు. అభిలషణీయ విధానాల రూపకల్పనలో ఎదురయ్యే సమస్యలను తెలుసుకోవడానికి దేశంలో ఎదురయ్యే సంస్థాగత మార్పులు, అధిక వృద్ధి, పేదరిక నిర్మూలన మొదలైన అంశాలు ఉపకరిస్తాయని తద్వారా సంస్కరణల నాణ్యత మెరుగవుతుందని ఆమర్త్యసేన్ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 7 శాతానికి దిగజారేఅవకాశం ఉందని, ద్రవ్యోల్బణ నియంత్రణకు ప్రత్యేక చర్యలు అవసరమని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ సి. రంగరాజన్ పేర్కొన్నారు. వృద్ధి, ద్రవ్యోల్బణం, మధ్యకాలిక వృద్ధి మధ్యనే ట్రేడ్‌ఆఫ్ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
స్టాండర్ట్ అండ్ పూర్ సంస్థ భారత రుణ రేటింగ్‌ను రుణాత్మకంగా సూచించినా.. భారత్ పునాది పటిష్టంగా ఉండడంవల్ల విదేశీ పెట్టుబడిదారులు.. పెట్టుబడులు ఉపసంహరించుకునే అవకాశాలు లేవని, ఇంధన ధరల డీ రెగ్యులేషన్ ద్వారా రెండోతరం సంస్కరణలను అమలు చేయాలని ఆసియా అభివృద్ధి బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ జనరల్ ‘రజత్‌నాగ్’ అభిప్రాయపడ్డారు.
గ్రామీణ ఉత్పాదకత తక్కువగా ఉండటం భారత్ ఎదుర్కొంటున్న సమస్యని, గ్రామీణ ఉద్యమిత్వం చైనా అభివృద్ధికి దోహదపడిన విధంగా భారత్‌కు జరగలేదని ఐఎంఎఫ్ మాజీ చీఫ్ ఎకనమిస్ట్ రఘురామ్ రాజన్ అభిప్రాయ పడ్డారు. దేశంలో వ్యవసాయ ఉత్పాదకత పెంపుపై శ్రద్ధ చూపకుండా ఉపాధి హామీ పథకం అమలు, వివిధ ఉత్పత్తుల మద్దతు ధర పెంపు వంటి కార్యక్రమాల్ని అమలు చేయడం వల్ల ప్రయోజనం లేదని రఘురామన్ అభిప్రాయపడ్డారు.
ఆయా రంగాల్లో రెండో దశ సంస్కరణలు

- భూమి, ఇతర ఉత్పాదితాల వినియోగానికి వ్యవసాయ రంగంలో సంస్థాపరమైన మార్పులతోపాటు సాంకేతిక పరిజ్ఞాన వినియోగం అత్యవసరం. వ్యవసాయ రంగంలో ఇప్పటి వరకు ప్రవే శ పెట్టిన సంస్కరణలు వ్యవసాయరంగ అభివృద్ధికి అనుకున్నంతగా దోహదపడలేదు. గ్రామీణ ఆదాయాల వృద్ధికి అనేక చర్యలు తక్షణావసరం. వ్యవసాయ రంగంపైనే అధిక శ్రామిక శక్తి ఆధారపడి ఉన్నందువల్ల ఉత్పత్తి పెంపు, పంట మార్పిడి విధానం ప్రముఖపాత్ర పోషించనున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు వ్యవసాయ రంగంలో అధిక సబ్సిడీల విధానాన్ని అవలంబించినంత కాలం భారత్ తన ఎగుమతుల
- సామర్థ్యాన్ని పెంచుకోలేదు. 2025 నాటికి చైనా జనాభాను భారత్ అధిగమించే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రధాని మన్మోహన్ సింగ్ రెండో హరిత విప్లవానికి పిలుపునిచ్చారు. అవసరమైన పరిమాణంలో నాణ్యమైన ఆహారాన్ని చౌక ధరలకు అందించడం, పౌష్టికాహార భ ద్రతను కల్పించడం లక్ష్యాలుగా ‘జాతీయ ఆహార భద్రత బిల్లు’కు 2011లో పార్లమెంట్ ఆమోదం తెలిపింది.
- రాజకీయ ఒత్తిడులు ఎదురైనా అధిక సబ్సిడీతో ఉన్న డీజిల్ ధర పెంపుతోపాటు వంట గ్యాస్ సబ్సిడీలో కేంద్రం కోత విధించింది. సబ్సిడీ భారం తగ్గించుకోవడానికి కరెంట్ ఖాతా లోటు పెరగడం కారణమైంది.
- వచ్చే ఐదేళ్లలో బీమా రంగానికి రూ.62 వేల కోట్ల (12 బిలియన్ డాలర్లు) మూలధనం అవసరమవుతుంది. గత దశాబ్ద కాలంలో ఇన్సూరెన్స్ రంగంలో పెట్టుబడులు పెట్టిన స్వదేశీ, విదేశీ సంస్థల ఒత్తిడి మేరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని బీమారంగంలో 26 నుంచి 49 శాతానికి పెంచుతూ, పెన్షన్ ఫండ్‌లో 26 శాతానికి అనుమతిస్తూ ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటికి పార్లమెంటు ఆమోదం తప్పనిసరి. కంపెనీల బిల్లుకు సంబంధించి సవరించిన డ్రాఫ్ట్‌నూ కేబినెట్ ఆమోదించింది. ప్రాథమిక అడ్డంకులను తొలగించిన పక్షంలో భారత్ వృద్ధిరేటు తిరిగి 9 శాతానికి చేరుకోవడం ద్వారా దేశంలో పొదుపు రేటు పెరిగి పెట్టుబడి రేటు జీడీపీలో 37 నుండి 38 శాతం మధ్య ఉండవచ్చని ఆర్థికమంత్రి చిదంబరం ఆశాభావం వ్యక్తం చేశారు. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెంచడంతోపాటు సవరించిన బీమా బిల్లు నియంత్రణలను పటిష్టం చేసి భారత మార్కెట్లోకి ఫారెన్-రీ-ఇన్సూరల్స్ ప్రవేశించడానికి అనుకూలంగా రూపొందించారు. సవరించిన
- కంపెనీల బిల్లు డ్రాఫ్ట్ ప్రకారం కంపెనీలు తమ నిర్ణీత లాభాల స్థాయి లేదా టర్నోవర్‌కు సంబంధించి న సగటు ఆదాయాల్లో 2 శాతాన్ని మూడేళ్ల కాలంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యకలాపాలపై వెచ్చించాలి.
- మల్టీబ్రాండ్ రిటైల్ రంగంలో 51 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రభుత్వం అనుమతించింది. సప్లయ్ చైన్‌లో మధ్యవర్తులను తొలగిస్తూ రైతులకు ప్రత్యక్షంగా ప్రయోజనాన్ని కల్పించడం ద్వారా అధిక ఉపాధి పెరుగుదలకు ఈ చర్య దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రిటైల్ మార్కెట్‌లో ఎఫ్‌డీఐల అనుమతి పోటీతత్వాన్ని పెంపొందిస్తుందని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ అశోక్ చావ్లా అభిప్రాయపడ్డారు.
- పన్నుల సంస్కరణల్లో భాగంగా విలువ ఆధారిత పన్ను (వ్యాట్) స్థానంలో ‘వస్తు సేవల పన్ను’ను ప్రభుత్వం ప్రతిపాదించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వస్తు, సేవల పన్నుపై విధించే అన్ని రకాల పరోక్ష పన్నుల స్థానంలో జీఎస్‌టీ (వస్తు సేవల పన్ను) అమలు చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ ఇంకా ఈ నిర్ణయం అమలులోకి రాలేదు.
- వస్తు సేవల పన్నును 12 శాతంగా నిర్ణయించాలని 13వ ఆర్థిక సంఘం ప్రభుత్వానికి సలహా ఇచ్చింది.
- బ్యాంకులు, ఇతర విత్త సంస్థల్లో అంతర్గత సంస్కరణలకు ప్రాధాన్యమివ్వాలి. రెండో దశ సంస్కరణల అమలులో భాగంగా బ్యాంకింగ్ సర్వీసుల వ్యయాన్ని తగ్గించడం, క్రెడిట్ డెలివరీ యంత్రాంగాన్ని పటిష్టపరచడం, ఖాతాదారుల సేవల మెరుగుదల, యాజమాన్య పద్ధతులలో సంస్కరణలు, బ్యాంకింగ్ కార్యకలాపాలు లేని ప్రాంతాలకు బ్యాంకింగ్ రంగాన్ని విస్తరించడం వంటి చర్యలు చేపట్టాలి. బేసెల్-3 నియమావళిని జనవరి 1, 2013న ప్రారంభించి మార్చి 31, 2018 నాటికి సంతృప్తికరంగా ఉండేలా సంపూర్ణంగా బ్యాంకింగ్ రంగాన్ని తీర్చిదిద్దాలి.
- గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పునాదులను పటిష్టం చేసి వ్యవసాయం, అనుబంధ రంగాల్లో వృద్ధి సాధించాలి.
- ఐటీ, బీటీ, ఫార్మాస్యుటికల్ వంటి నాలెడ్జ్ బేస్డ్ పరిశ్రమల సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి.
- టెక్స్‌టైల్స్, తోలు, ఆగ్రో ప్రాసెసింగ్ వంటి చిన్న తరహా పరిశ్రమల ఆధునికీకరణకు యత్నించాలి.
- శక్తి, రోడ్లు, నౌకాశ్రయాలు, టెలికాం, రైల్వే, ఎయిర్‌వేస్ రంగాలకు మౌలిక సౌకర్యాల కొరతను నివారించాలి.
- పేద, బలహీనవర్గాల అభ్యున్నతి క్రమంలో మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ సామాజిక కార్యక్రమాలైన విద్య, ఆరోగ్యం, ఇతర సామాజిక సేవల కల్పనకు విధి విధానాలు రూపొందించుకోవాలి.
- ఎగుమతుల వృద్ధి, అధిక విదేశీ పెట్టుబడి, బహిర్గత రుణ యాజమాన్య పద్ధతులతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచే చర్యల్లో తగిన పాత్ర పోషించాలి.
- ప్రాంతీయ అసమానతల తగ్గింపు ద్వారా ఉపాధి సామర్థ్యాన్ని పెంచి పూర్ణోద్యోగం సాధించాలి.
- పేదరిక రేఖ దిగువన నివసించే ప్రజల సంఖ్య శాతాన్ని తగ్గిస్తూ అధిక జీడీపీ వృద్ధి సాధనకు ప్రయత్నించాలి.
- రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పాలనలో సంస్కరణలు తెచ్చి స్థానిక సంస్థల సామర్థ్యాన్ని మెరుగుపరచాలి.
- వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు అవసరమైన చర్యలు చేపట్టి.. పట్టణ మార్కెట్లలో కనెక్టివిటీ పెంచడానికి గ్రామీణ రోడ్ల నిర్మాణం వేగవంతం చేయాలి.
Published date : 17 Oct 2012 01:22PM