Skip to main content

పోటీ పరీక్షల్లో జాతీయాదాయం, విదేశీ వాణిజ్యం, పేదరికం - సాంఘిక భద్రత - సుస్థిర వృద్ధి, ద్రవ్యోల్బణం విభాగాల ముఖ్యాంశాలను...

- బి. అనిల్‌కుమార్, హైదరాబాద్.
Question
పోటీ పరీక్షల్లో జాతీయాదాయం, విదేశీ వాణిజ్యం, పేదరికం - సాంఘిక భద్రత - సుస్థిర వృద్ధి, ద్రవ్యోల్బణం విభాగాల ముఖ్యాంశాలను తెలపండి?
జాతీయాదాయం: స్థూల జాతీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి, నికర జాతీయోత్పత్తి, నికర దేశీయోత్పత్తి, ఎన్‌ఎన్‌పీ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, వ్యష్టి ఆదాయం, వ్యయార్హ ఆదాయం, తలసరి ఆదాయం, కేంద్ర గణాంక సంస్థ, జాతీయాదాయం-మానవ శ్రేయస్సు, ఆదాయ అసమానతలు, ఉత్పత్తి, ఆదాయ, వ్యయాల మదింపు పద్ధతులు.

విదేశీ వాణిజ్యం:
వాణిజ్య శేషం, చెల్లింపుల శేషం, వర్తక నిబంధనలు, విదేశీ మారక ద్రవ్యం, వాణిజ్య విధానం, మూల్యహీనీకరణ, రీ వాల్యుయేషన్, స్థిర వినిమయ రేటు, అస్థిర వినిమయ రేటు, అప్రెసియేషన్, కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్, ఎల్‌ఈఆర్‌ఎమ్‌ఎస్, హార్డ్ కరెన్సీ, సాఫ్ట్ కరెన్సీ, హాట్ కరెన్సీ, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు, నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్ఛేంజ్ రేట్, రియల్ ఎఫెక్టివ్ ఎక్స్ఛేంజ్ రేట్.

పేదరికం - సాంఘిక భద్రత - సుస్థిర వృద్ధి:
మానవాభివృద్ధి, సమ్మిళిత వృద్ధి, ఉపాధి, పేదరిక నిర్మూలనా కార్యక్రమాలు, సాంఘిక భద్రత, గ్రామీణ మౌలిక సౌకర్యాలు, పట్టణ మౌలిక సౌకర్యాలు, నైపుణ్యాభివృద్ధి, విద్య, ఆరోగ్యం, మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి.

ద్ర వ్యోల్బణం:
ద్రవ్యోల్బణ రకాలు, ద్రవ్యోల్బణ ప్రభావం, ఫిలిప్స్ రేఖ, టోకు ధరల సూచీ, వినియోగదారుని ధరల సూచీ, స్టాగ్ ఫ్లేషన్, డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం, వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం.

Photo Stories