Skip to main content

పోటీ పరీక్షలకు సంబంధించి ‘పట్టణ నిరుద్యోగం–నిర్మూలన చర్యలు’ గురించి తెలియజేయండి.

– వి.అవినాశ్, హైదరాబాద్‌.
Question
పోటీ పరీక్షలకు సంబంధించి ‘పట్టణ నిరుద్యోగం–నిర్మూలన చర్యలు’ గురించి తెలియజేయండి.
  • పారిశ్రామిక సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా పట్టణ నిరుద్యోగ సమస్యను నిర్మూలించవచ్చు. తక్కువ వ్యయంతో ప్రస్తుతం ఉన్న పరిశ్రమల విస్తరణ, ఆధునికీకరణకు తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు నూతన పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నించాలి.
  • ముఖ్యంగా ఇనుము, ఉక్కు, రసాయనాలు, రక్షణ వస్తువులు, హెవీ మిషనరీ, విద్యుదుత్పాదన, అణుశక్తికి సంబంధించిన పరిశ్రమల ఆధునికీకరణ, విస్తరణపై దృష్టి సారించాలి. తద్వారా పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుత, భవిష్యత్‌ తరాలకు ఉపాధి అవకాశాలు విస్తృతమవుతాయి.
  • విద్యార్థులను సాధారణ విద్య నుంచి వృత్తి విద్య వైపు మరల్చాలి. తద్వారా యువత స్వయం ఉపాధి దిశగా దృష్టి కేంద్రీకరించగలుగుతుంది.
  • శ్రమ–సాంద్రత పరిజ్ఞానాన్ని వినియోగించే చిన్న తరహా, కుటీర పరిశ్రమల అభివృద్ధిని ప్రోత్సహించాలి.
  • పట్టణ అసంఘటిత రంగంలో అనేక మంది ప్రజలు నిమగ్నమై ఉన్నారు. అందువల్ల ఈ రంగాన్ని అభివృద్ధిపరచడం, ఆధునికీకరించడానికి తగిన చర్యలు చేపట్టాలి. ఫలితంగా పెరుగుతున్న పట్టణ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.
  • షెడ్యూల్డ్, వాణిజ్య బ్యాంకులు ప్రత్యేకంగా రిటైల్‌ రంగం, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు తక్కువ వడ్డీకి పరపతిని అందించాలి. అర్బన్‌ అసంఘటిత రంగాన్ని అభివృద్ధి చేయడానికి సేవా రంగానికి సంబంధించి అనేక యూనిట్లను అభివృద్ధి చేయాలి. ఉత్పాదక రంగాలపై పెట్టుబడులు పెంచడం ద్వారా ఉపాధి అవకాశాలను విస్తృతపరచాలి.
  • గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పెరుగుతున్న కారణంగా పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం అధికమవుతోంది. దీంతో పట్టణ ప్రాంతాల్లో మురికివాడలు కూడా పెరిగి మౌలిక సౌకర్యాల కొరత ఏర్పడుతోంది.

Photo Stories