Skip to main content

నేను డిగ్రీ చదువుతున్నాను. అమెరికాలో ఫిల్మ్‌ డెరైక్షన్‌ అండ్‌ ప్రొడక్షన్‌ కోర్సుల్లో ప్రవేశానికి మార్గం ఏంటి?

Question
నేను డిగ్రీ చదువుతున్నాను. అమెరికాలో ఫిల్మ్‌ డెరైక్షన్‌ అండ్‌ ప్రొడక్షన్‌ కోర్సుల్లో ప్రవేశానికి మార్గం ఏంటి?
అమెరికాలో దాదాపు 22 యూనివర్సిటీలు/ఇన్‌స్టిట్యూట్‌లు సినీ రంగానికి చెందిన పలు కోర్సులను (డెరైక్షన్‌, ఎడిటింగ్‌, ప్రొడక్షన్‌, స్క్రిప్ట్‌ రైటింగ్‌ తదితర) డిప్లొమా, డిగ్రీ స్థాయిల్లో అందిస్తున్నాయి. ఈ ఇన్‌స్టిట్యూట్‌లలో అధిక శాతం న్యూయార్క్‌, లాస్‌ఏంజెలిస్‌లలోనే ఉన్నాయి. వీటిలో ప్రవేశించే ముందు సంబంధిత కళాశాలకు యూనివర్సిటీల గుర్తింపు ఉందా? సర్టిఫికెట్లు మంజూరు చేస్తారా? ఫ్యాకల్టీకి సినీ రంగంలో అనుభవం ఏదైనా ఉందా? అనే విషయాలను పరిగణనలోకి తీసుకుంటే మంచి ఇన్‌స్టిట్యూట్‌ను ఎంచుకోవడం సులువవుతుంది. సాధారణంగా అన్ని ఇన్‌స్టిట్యూట్‌లు బ్యాచిలర్‌ డిగ్రీ కనీస అర్హతగా ప్రవేశం కల్పిస్తున్నాయి. ఫిల్మ్‌ కోర్సుల్ని పూర్తి చేసుకున్న వారికి సాధారణంగా మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ టైటిల్‌తో సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ఇక.. ఫిల్మ్‌ స్కూల్స్‌ కూడా మూడు విభాగాలుగా ఉంటాయి. అవి..
ఇండస్ట్రీ ఫిల్మ్‌ స్కూల్స్‌: ఇవి విద్యార్థులకు హాలీవుడ్‌లో కెరీర్‌ అన్వేషణకు ఉపయోగపడే రీతిలో బోధిస్తాయి.
ఇండిపెండెంట్‌ ఫిల్మ్‌ స్కూల్స్‌: హాలీవుడ్‌ కాకుండా ఇతర ప్రాంతాల్లో సినిమా అవకాశాలను మెరుగుపరిచే విధంగా బోధన ఉంటుంది.
ఎక్స్‌పరిమెంటల్‌ స్కూల్స్‌: ఇవి సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రాధాన్యమిస్తూ.. బోధన సాగిస్తాయి. కళాత్మక దృష్టి ఉన్న వారికి ఈ ఎక్స్‌పరిమెంటల్‌ స్కూల్స్‌ చక్కని వేదికలు.
ఆయా ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లు విద్యార్థుల్లోని రైటింగ్‌ స్కిల్స్‌ను ప్రధాన ప్రామాణికంగా పరిగణిస్తాయి. అంతేకాక.. ఈ రంగం పట్ల విద్యార్థులకున్న ఆసక్తిని బేరీజు వేసేందుకు వారు నిర్మించిన లఘుచిత్రాలు ఉంటే ఎక్కువ వెయిటేజీ ఉంటుంది. ఇన్‌స్టిట్యూట్‌లో ప్రవేశించాక ఆసక్తిని బట్టి స్పెషలైజేషన్లు ఎంచుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తారు. ప్రస్తుతం అమెరికాలోని ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియా, పెన్సెల్వే నియా స్టేట్‌ యూనివర్సిటీ (పార్క్‌ క్యాంపస్‌), బోస్టన్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ లాస్‌ ఏంజెలిస్‌, రోచెస్టర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలు ప్రముఖమైనవి.
వెబ్‌సైట్‌:  www.educationusa.state.gov

Photo Stories