Skip to main content

Advertisement

నేను సైన్స్ సబ్జెక్టులతో డిగ్రీ పూర్తిచేశాను. డిజిటల్ మార్కెటింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకుంటున్నాను. ఈ విభాగంలో ఎలాంటి అవకాశాలు ఉంటాయో తెలపండి?
+

ఇంటర్నెట్ ద్వారా మార్కెటింగ్, అడ్వర్‌టైజ్‌మెంట్, ఆయా ఉత్పత్తులు, సేవలకు ప్రచారం కల్పించడమే... డిజిటల్ మార్కెటింగ్! ఇది కూడా సంప్రదాయ మార్కెటింగ్, అడ్వర్‌టైజింగ్‌లాగే ఉంటుంది కాకపోతే ఇంటర్నెట్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉత్పత్తులకు మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది. నేటి సోషల్ మీడియా యుగంలో కంపెనీలు డిజిటల్ మార్కెటింగ్ విధానాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. విని యోగదారులు ఎక్కువ సమయం ఆన్‌లైన్‌లో గడపుతుం డటమే అందుకు కారణమని చెప్పొచ్చు. ఏ విభాగంలో డిగ్రీ పూర్తిచేసినా డిజిటల్ మార్కెటింగ్‌ను తమ కెరీర్‌గా ఎంచుకోవచ్చు. కంప్యూటర్స్, ఇంటర్నెట్, ఈ కామర్స్, స్టాటిస్టిక్స్, డేటాతోపాటు సృజనాత్మకత కూడా ఉండాలి. వినియోగదారులను ఆకట్టుకునేలా తమ ఉత్పత్తులు, సేవలకు ఆన్‌లైన్‌లో ప్రచారం కల్పించగలిగే చాకచక్యం తప్పనిసరి. డిగ్రీ పూర్తయ్యాక ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు డిజిటల్ మార్కెటింగ్‌కు సంబంధించి అందించే డిప్లొమా కోర్సులు, సర్టిఫికెట్ కోర్సుల్లో చేరడం ద్వారా డిజిటల్ మార్కెటింగ్ విధానాల గురించి అవగాహన పొందొచ్చు. మూక్స్ విధానంలో ఆన్‌లైన్ కోర్సులు పూర్తిచేసుకునే వీలుంది. ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ కెరీర్‌లో రాణించాలంటే.. సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్, వెబ్ డిజైనింగ్, ఈ కామర్స్ సొల్యూషన్స్, ఆన్‌లైన్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, కాపీ రైటింగ్ తదితర అంశాలపై పట్టు అవ సరం.