Skip to main content

ఐబీపీఎస్‌ కామన్‌ రిటెన్‌ ఎగ్జామినేషన్‌ తర్వాత రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ అన్ని బ్యాంకుల్లో ఒకే విధంగా ఉంటుందా?

Question
ఐబీపీఎస్‌ కామన్‌ రిటెన్‌ ఎగ్జామినేషన్‌ తర్వాత రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ అన్ని బ్యాంకుల్లో ఒకే విధంగా ఉంటుందా?
కామన్‌ రిటెన్‌ ఎగ్జామినేషన్‌కు శ్రీకారం చుట్టినా... ఆయా బ్యాంకుల రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ మాత్రం వేర్వేరుగానే ఉంటుంది. అంటే ప్రతి బ్యాంకు.. తమ పరిధిలోని ఖాళీల కోసం నిర్దిష్ట అర్హత ప్రమాణాలు పేర్కొంటూ ప్రత్యేక నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. వాటికి సరితూగే అభ్యర్థులు కామన్‌ రిటెన్‌ ఎగ్జామినేషన్‌ స్కోర్‌ కార్డ్‌ను జతచేస్తూ దరఖాస్తు చేసుకోవాలి. కామన్‌ ఎగ్జామినేషన్‌లో కనీస అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులకు ఐబీపీఎస్‌ స్కోర్‌ కార్డ్‌ అందిస్తుంది. దీనికి ఏడాది వరకు గుర్తింపు ఉంటుంది. అంటే.. ఆ ఏడాది సమయంలో నిర్దేశిత 19 బ్యాంకుల్లో రిక్రూట్‌మెంట్‌కు ఆ స్కోర్‌ ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

Photo Stories