Skip to main content

సీబీఐ ఆఫీసర్‌ కావడం ఎలా?

Question
సీబీఐ ఆఫీసర్‌ కావడం ఎలా?
సీబీఐలో చాలా వరకు ఖాళీలను వివిధ సెంట్రల్‌, స్టేట్‌ శాఖల్లోని సిబ్బందిని డిప్యూటేషన్‌ మీద నియమించడం ద్వారా భర్తీ చేస్తారు. ఎస్‌పీ ర్యాంక్‌ ఆఫీసర్లను మాత్రం ఐపీఎస్‌ల ద్వారా భర్తీ చేస్తారు. వీరిని వివిధ రాష్ట్రాల నుంచి డిప్యూటేషన్‌ మీద నియమించుకుంటారు. కాబట్టి ముందు మీరు సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపికవాల్సి ఉంటుంది. సివిల్స్‌ కాకుండా స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) నిర్వహించే కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఎగ్జామ్‌ ద్వారా ఇన్‌స్పెక్టర్‌ హోదాలో సీబీఐలోకి ప్రవేశించవచ్చు. ఈ ఎగ్జామ్‌ ప్రిలిమినరీ, మెయిన్స్‌, ఇంటర్వ్యూ మూడు విధాలుగా ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష జనరల్‌ ఇంటలిజెన్స్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, అర్థిమెటిక్‌ అంశాల్లో ఏ, బీలుగా ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఉంటుంది. మెయిన్స్‌ జనరల్‌ స్టడీస్‌, ఇంగ్లిష్‌, అర్థిమెటిక్‌, లాంగ్వేజ్‌ కాంప్రెహెన్షన్‌ అంశాల్లో ఉంటుంది. చివరి దశ ఇంటర్వ్యూ. మరిన్ని వివరాలకు www.ssc.nic.in లేదా www.cbi.gov.in చూడొచ్చు.

Photo Stories