Skip to main content

పోటీ పరీక్షల్లో జనరల్ సైన్స్ విభాగం నుంచి వైరస్‌లకు సంబంధించి ఏయే అంశాలపై ప్రశ్నలు అడుగుతున్నారు.

కె.రంజిత్, కొత్తపేట
Question
పోటీ పరీక్షల్లో జనరల్ సైన్స్ విభాగం నుంచి వైరస్‌లకు సంబంధించి ఏయే అంశాలపై ప్రశ్నలు అడుగుతున్నారు.
జనరల్ సైన్స్ లో సూక్ష్మజీవులకు సంబంధించి ప్రతి పోటీ పరీక్షలో మూడు నుంచి నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారు. ముఖ్యంగా వైరస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవా, ఫంగ‌స్ లాంటి వాటిపైనే ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. వైరస్‌కు సంబంధించి ముఖ్యంగా.. వైరస్ వల్ల మానవుడికి కలిగే అనర్థాలు, వ్యాధుల గురించి అడుగుతారు. అందువల్ల వివిధ వ్యాధుల సంక్రమణ, వ్యాప్తి మొదలైన అంశాల గురించి స్పష్టమైన అవగాహన ఉండాలి. నివారణ, నిర్మూలన మధ్య తేడా తెలిసి ఉండాలి. వ్యాధి - వ్యాధి కారకాలు; ఎయిడ్స్‌ డే, మలేరియా డే లాంటి ప్రత్యేక రోజులను టేబుల్ రూపంలో పొందుపరుచుకొని గుర్తుంచుకోవాలి. అలాగే మా మ‌ధ్యకాలంలో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ గురించి కూడా పూర్తిగా తెలుసుకోని ఉండాలి.

Photo Stories