Skip to main content

బీకాం ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాను. నాకు ఇన్‌కంటాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేయాలని ఉంది. ఇందులోకి ప్రవేశించాలంటే మార్గం ఏమిటి? ఏ...

Question
బీకాం ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాను. నాకు ఇన్‌కంటాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేయాలని ఉంది. ఇందులోకి ప్రవేశించాలంటే మార్గం ఏమిటి? ఏ పరీక్ష రాయాలి. వివరాలు తెలుపండి?
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) ఏటా నిర్వ హించే కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ ఎగ్జామ్‌ (సీజీఎల్‌ఈ)లో ఉత్తీర్ణులు కావడం ద్వారా మీరు కోరుకున్న విధంగా ఇన్‌కంటాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించే వీలుంది. ఈ పరీక్ష రాయడానికి కనీసం ఏదేని డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
పరీక్ష వివరాలు: సీజీఎల్‌ఈ రెండు దశలుగా జరుగుతుంది. మొదటిది ప్రిలిమ నరీ పరీక్ష. ఇందులో ఉత్తీర్ణులైనవారు మెయిన్‌ పరీక్షకు అర్హులు. చివరగా ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్షలో జనరల్‌ ఇంటెలిజెన్స్‌, జనరల్‌ అవే ర్‌నెస్‌ (పార్ట్‌- ఎ), అర్ధమెటిక్‌ (పార్ట్‌-బి)లో సామర్ధ్యాన్ని పరీక్షిస్తారు. ఈ పరీక్ష ద్వారా అసిస్టెంట్‌ గ్రేడ్‌, ఇన్‌స్పెక్టర్స్‌ ఆఫ్‌ సెంట్రల్‌ ఎకై ్సజ్‌, ఇన్‌కంటాక్స్‌, కస్టమ్‌ హౌస్‌లలో ప్రివెంటివ్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్స్‌ ఉద్యోగా లను భర్తీ చేస్తారు. సీజీఎల్‌ఈ నోటిఫికేషన్‌ ఏటా ఏప్రిల్‌ మొదటి వారంలో ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌తోపాటు ప్రముఖ దినపత్రికల్లో ప్రచురితమవుతుంది.

Photo Stories