సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదోతరగతి ప్రవేశాలకు సంబంధించి వీటీజీసెట్–2023 పరీక్ష ప్రశాంతంగా జరిగింది.
వీటీజీసెట్–2023 ఫలితాలు వివరాలు
ఏప్రిల్ 23న రాష్ట్రవ్యాప్తంగా 638 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు.గురుకులాల్లో మొత్తం 51,524 సీట్లు ఖాళీగా ఉండగా, 12,1826 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా..11,3211 మంది పరీక్షకు హాజరయ్యారు. మే రెండో వారంలో పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.