RGUKT CET: ఆర్జీయూకేటీ సెట్–2021కి భారీగా దరఖాస్తులు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఆర్జీయూకేటీ సెట్–2021కి సెప్టెంబర్ 7 నాటికి 74,088 దరఖాస్తులు వచ్చాయి.
నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో కలిపి 4 వేల సీట్లు ఉండగా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. రూ.1,000 ఫన్ తో సెప్టెంబర్ 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువుండటంతో మరిన్ని దరఖాస్తులు వస్తాయని ఆర్జీయూకేటీ అధికారులు భావిస్తున్నారు. అత్యధికంగా వైఎస్సార్ జిల్లా నుంచి 8,778 దరఖాస్తులు రాగా, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లా నుంచి కేవలం 2,992 దరఖాస్తులు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి 1,328 దరఖాస్తులు రావడం గమనార్హం. సెప్టెంబర్ 26న నిర్వహించనున్న పరీక్షకు 18వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌ¯న్లోడ్ చేసుకోవచ్చు.
Published date : 08 Sep 2021 04:04PM