LPCET: ఎల్పీ సెట్ ఫలితాలు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో సేప్టేంబర్ 25న నిర్వహించిన లాంగ్వెజ్ పండిట్ సెట్–2021 ఫలితాలను అక్టోబర్ 1న విడుదల చేయనున్నట్టు ఎల్పీసెట్ ప్రాంతీయ కన్వీనర్ దుక్కిపాటి మధుసూదనరావు గురువారం వెల్లడించారు.
ఈ నెల 25న జరిగిన ఎల్పీసెట్‌లో తెలుగు భాషా పండిత అర్హత పరీక్షకు 705 మంది, హిందీ భాషా పండిత అర్హత పరీక్షకు 1,381 కలిపి మొత్తం 2,086 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారన్నారు. వీరు తమ ఫలితాలు, ర్యాంకు కార్డులను https://aplpcet.apcfss.in వెబ్‌సైట్‌లో డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
చదవండి:
Published date : 01 Oct 2021 12:38PM