LPCET: త్వరలో లాంగ్వెజ్ పండిట్ పరీక్ష.. సీట్ల వివరాలు ఇలా..
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 25న లాంగ్వెజ్ పండిట్ అర్హత పరీక్ష (ఎల్పీసెట్)ను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఎల్పీసెట్ కన్వీనర్, జోన్ –2 ఆర్‌జేడీ డి.మధుసూదన్ రావు తెలిపారు.
జిల్లా విద్యాశాఖాధికారులతో సెప్టెంబర్ 20న దీనిపై ఆయన ఆన్ లైన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎల్పీసెట్ కోసం రాష్ట్రంలో 14 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసామన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. తెలుగు లాంగ్వేజ్ పండిట్ కోర్సు (టీపీటీ)కు రాష్ట్రవ్యాప్తంగా 3 ప్రభుత్వ టీపీటీ కళాశాలల్లో 150 సీట్లు, 32 ప్రయివేట్ టీపీటీ కళాశాలల్లో 1,770 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. హిందీ లాంగ్వేజ్ పండిట్ కోర్సుకు 48 ప్రయివేట్ కళాశాలల్లో 3,100 సీట్లు ఉన్నాయన్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్లను https://aplpcet.apcfss.in/ వెబ్‌సైట్లో డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
Published date : 21 Sep 2021 12:28PM