Skip to main content

వర్సిటీ కాలేజీల్లో లాటరల్ ఎంట్రీ శాతం పెంపు

హైదరాబాద్: యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో ద్వితీయ సంవత్సరంలో చేర్చుకుంటున్న(లాటరల్ ఎంట్రీ) డిప్లొమా విద్యార్థుల శాతాన్ని 5 నుంచి 10 శాతానికి పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో 10 శాతం మంది డిప్లొమా విద్యార్థులను చేర్చుకుంటుండగా, యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో 5 శాతం విద్యార్థులకే ప్రవేశాలు కల్పిస్తున్నారు. దానిని 10 శాతానికి పెంచడంపై 5న జరిగే వీసీల సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఎంసీఏలోనూ లాటరల్ ఎంట్రీ..: బీసీఏ, బీకాం కంప్యూటర్స్, బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన విద్యార్థులు ఎంసీఏ ద్వితీయ సంవత్సరంలో చేరేలా లాటరల్ ఎంట్రీ అవకాశం కల్పించనున్నట్టు వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.
Published date : 03 May 2014 11:58AM

Photo Stories