Skip to main content

విద్యుత్ సబ్ ఇంజనీర్ల భర్తీకి ప్రకటన జారీ

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ సంస్థల్లో సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్) 153 సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి శనివారం ప్రకటన జారీ చేసింది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. త్వరలో www.tssouthernpower.com వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌ను ప్రదర్శించనున్నారు. ఇదిలాఉండగా.. త్వరలో ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) నుంచి 314, జెన్‌కో నుంచి 92, ట్రాన్స్‌కో నుంచి 174 సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ప్రకటనలు రానున్నాయి. ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలలో 733 సబ్ ఇంజనీర్ పోస్టులతో పాటు 1,948 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి గతంలోనే ప్రభుత్వం పరిపాలనాపర అనుమతులు ఇచ్చింది. ఇప్పటికే ఏఈ పోస్టుల రాత పరీక్షకు సంబంధించిన ఫలితాలు సైతం వెల్లడయ్యాయి. త్వరలో తుది జాబితాలను ప్రకటించేందుకు విద్యుత్ సంస్థలు కసరత్తు చేస్తున్నాయి.
Published date : 04 Jan 2016 01:44PM

Photo Stories