విద్యార్థినుల కోసం సీబీఎస్ఈ ఉడాన్
Sakshi Education
దేశంలో ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్యార్థినుల శాతాన్ని పెంచడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ).. ఉడాన్ అనే కొత్త ప్రాజెక్టును ప్రారంభించింది. టాప్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలు పొందేలా దేశవ్యాప్తంగా ప్రతిఏటా 1000 మంది అమ్మాయిలకు ఉడాన్ ద్వారా శిక్షణనిస్తారు. వీరిలో సగం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల్లో ఉండేలా చూస్తారు. పదకొండు, పన్నెండో తరగతి చదువుతున్న విద్యార్థినులను జేఈఈలో విజయం దిశగా నడిపించడానికి ఉడాన్ ద్వారా ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో ఉచితంగా కోర్సులు నిర్వహిస్తారు.
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 27
వెబ్‌సైట్: https://cbse.nic.in
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 27
వెబ్‌సైట్: https://cbse.nic.in
Published date : 16 Oct 2014 03:42PM