Skip to main content

వేగంగా ప్రైవేటు వర్సిటీల ఏర్పాటు ప్రక్రియ

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటు ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇప్పటికే 11 సంస్థలు వర్సిటీల ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్నాయి.
 అందులో కొన్ని తాము ఏర్పాటు చేయబోయే వర్సిటీకి సంబంధించిన ప్రజెంటేషన్‌ను యూనివర్సిటీల అనుమతి కమిటీ ముందు ఇచ్చాయి. దీంతో అక్టోబర్ నెల 29న టెక్ మహీంద్ర, నవంబర్ 16న వాగ్జన్ సంస్థ ఏర్పాటు చేయబోయే యూనివర్సిటీ ప్రతిపాదిత స్థలాన్ని, భవనాలను కమిటీ తనిఖీ చేసింది. నవంబర్ 23నశ్రీనిధి, మల్లారెడ్డి (వుమెన్‌‌స వర్సిటీ) సంస్థలు, నవంబర్ 27న వరంగల్‌లోని ఎస్‌ఆర్ విద్యా సంస్థ, నవంబర్ 29న ర్యాడిక్లిప్ సంస్థ ఏర్పాటు చేయబోయే ప్రైవేటు వర్సిటీల స్థలాలు, భవనాలను కమిటీ తనిఖీ చేయనుంది. వరంగల్‌లోని వాగ్దేవి, సంగారెడ్డిలోని ఎంఎన్‌ఆర్, సెయింట్ మేరీస్, గురునానక్, జేబీఐటీ ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి.
Published date : 19 Nov 2019 04:32PM

Photo Stories