వెబ్‌సైట్లో ఇంజనీరింగ్ కాలేజీల తనిఖీ నివేదికలు
Sakshi Education
హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీలను నిజ నిర్ధారణ సంఘం (ఎఫ్‌ఎఫ్‌సీ) తనిఖీ చేసి ఇచ్చిన నివేదికలను జేఎన్‌టీయూ-హెచ్ యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ఉంచింది.
మొదటి దశ కింద 163 కాలేజీల నివేదికలను ఉంచారు. తనిఖీ సమయంలో తీసిన ఫొటోలతో పాటు నివేదికలను క్లుప్తంగా వివరించారు. తన పరిధిలోని 288 ఇంజనీరింగ్ కాలేజీల్లో మొదటి విడత తనిఖీల అనంతరం 163 కాలేజీల అనుబంధ గుర్తింపును జేఎన్‌టీయూ-హెచ్ నిరాకరించింది. దాంతో ఆ కాలేజీల యాజమాన్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. జేఎన్‌టీయూ కాకుండా ఇతర సంస్థల నిపుణులతో తనిఖీలు చేయించి, ఆ నివేదికలు వచ్చేలోపు ప్రవేశాలకు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే.
Published date : 08 Apr 2015 02:37PM