వెబ్‌లో జేఎన్‌టీయూహెచ్ ఇంజనీరింగ్ కాలేజీల జాబితా
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: జేఎన్‌టీయూహెచ్ పరిధిలో అనుబంధ గుర్తింపు పొందిన ఇంజనీరింగ్ కాలేజీల జాబితాను జేఎన్‌టీయూహెచ్ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.
కాలేజీలు, కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్‌సైట్ www.jntuhaac.in లో పొందవచ్చు. అనుబంధ గుర్తింపు లభించిన కాలేజీల వివరాలు, కాలేజీ వారీగా, సీట్ల వివరాలు అన్నింటినీ అందులో పొందుపరిచింది. కాగా, మొదటి దశ కౌనె ్సలింగ్‌లో భాగంగా ఈనెల 6 నుంచి విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేలా ఉన్నత విద్యా మండలి చర్యలు చేపడుతోంది. అంతకు ముందే విద్యార్థులు కాలేజీల వివరాలను వెబ్‌సైట్‌లో పొందవచ్చు.
Published date : 03 Jul 2015 01:25PM