ట్రిపుల్ ఐటీల్లో ఆరు నెలల్లో ఉద్యోగాల భర్తీ
Sakshi Education
వేంపల్లె: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీల్లో ఆరు నెలల్లోగా ఒక్కో క్యాంపస్‌కు 250 మంది చొప్పున శాశ్వత ప్రాతిపది కన ఉద్యోగులను నియమి స్తామని ఆర్జీయూకేటీ చాన్సలర్ కె.చెంచురెడ్డి చెప్పారు.
రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో ఈ నియమాకాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. నవంబర్ 7న ఇడుపులపాయలోని ఆర్‌కే వ్యాలీ, ఒంగోలు ట్రిపుల్ ఐటీల అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మెంటార్స్, హెచ్‌ఆర్‌టీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇడుపులపాయ ఆర్‌కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో సుమారు 2వేల మంది సామర్థ్యంతో ఆడిటోరియానికి డిసెంబర్ చివరి వారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారన్నారు. అలాగే కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
Published date : 08 Nov 2019 03:36PM