ట్రిపుల్ ఐటీ ఇంజినీరింగ్ ఫలితాలు విడుదల
Sakshi Education
బాసర: ఆదిలాబాద్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ- 2010 బ్యాచ్ ఇంజినీరింగ్ ఫలితాలను వైస్ చాన్స్‌లర్ సత్యనారాయణ బుధవారం విడుదల చేశారు.
ఇంజినీరింగ్ వివిధ విభాగాల్లో ఏప్రిల్‌లో జరిగిన పరీక్షలకు కళాశాలలోని మొత్తం వెరుు్య విద్యార్థులకు గానూ 843 మంది హాజరయ్యూరు. వీరిలో 745 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 319 మంది డిస్టింక్షన్‌లో, 423 మంది ఫస్ట్ డివిజన్, ముగ్గురు సెకండ్ డివిజన్‌లో ఉత్తీర్ణులయ్యారు. మొత్తం ఉత్తీర్ణత 88 శాతం నమోదైంది. మరో 98 మంది విద్యార్థులు అనుత్తీర్ణులయ్యారు. వీరికి జూన్ మూడో వారంలో సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు వీసీ పేర్కొన్నారు.
Published date : 26 May 2016 02:27PM