టీఎస్ పీజీఈసెట్ వెబ్ ఆప్షన్ తేదీల్లో మార్పు
Sakshi Education
హైదరాబాద్: తెలంగాణలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ఎంటెక్, ఎంఈ, ఎంఫార్మసీ, ఎమ్మార్క్‌ల్లో ప్రవేశానికి ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న పీజీఈసెట్-2015 వెబ్‌ఆప్షన్స్ సాంకేతిక కారణాల వల్ల 28వ తేదీకి మార్చినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ రమేశ్‌బాబు తెలిపారు.
తెలంగాణ ఇంజనీరింగ్ కళాశాలల్లో 25 వేల పీజీ సీట్లు ఉన్నట్లు అందులో 70 శాతం కన్వీనర్ కోటాలో, మిగతా 30 శాతం సీట్లను యాజమాన్యం కోటా కింద భర్తీ చేయనున్నట్లు వివరించారు.
Published date : 25 Aug 2015 04:40PM