టీఎస్ ఎంసెట్-2018 రెండో దశ సీట్లు కేటాయింపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణఇంజనీరింగ్ ప్రవేశాల్లో భాగంగా ఎంసెట్ రెండో దశ సీట్ల కేటాయింపును ప్రవేశాల కమిటీ జూలై 12న ప్రకటించింది.
ఇందులో కొత్తగా 13,206 మంది విద్యార్థులకు సీట్లు లభించగా, మొదటి కౌన్సె లింగ్లో సీట్లు వచ్చినా కాలేజీ మార్పు కోసం స్లైడింగ్‌లో అప్షన్లు ఇచ్చుకున్న మరో 14,595 మందికి సీట్లు లభించాయి. మొత్తంగా రెండో దశలో 27 వేల మందికిపైగా విద్యార్థులకు సీట్లను కేటాయించింది. సీట్లు పొందిన విద్యార్థులు అలాట్మెంట్ లెటర్లను https://tseamcet.nic.in నుంచి డౌన్లోడ్ చేసుకో వచ్చని ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో 52 వేల మంది విద్యార్థులకు సీట్లను కేటాయించినా, 38 వేల మంది విద్యార్థులే కాలేజీల్లో చేరారు. మిగతా విద్యార్థులు కాలేజీల్లో చేరకుండా రెండో విడత కౌన్సెలింగ్‌లో ఇతర కాలేజీలను ఎంపిక చేసుకున్నారు. మొత్తంగా ఎంసెట్‌లో అర్హత సాధించిన వారు 1,02,615 మంది ఉండగా, అందులో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైన వారు 62,901 మంది ఉన్నారు. రెండో విడత కౌన్సెలింగ్‌లో కొత్తగా వెరిఫికేషన్ కు హాజరైన వారు 4,594 మంది ఉన్నారు.
17,876 సీట్లు ఖాళీ...
ఇంజనీరింగ్, బీఫార్మసీ, ఫార్మ్-డి కోర్సులను నిర్వహిస్తున్న 302 కాలేజీల్లో 69,221 సీట్లు అందుబాటులో ఉండగా, అందులో 51,345 మందికి సీట్లను (74.18 శాతం) కేటాయించింది. మరో 17,876 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. ఇంజనీరింగ్ కాలేజీలు 189 ఉండగా, వాటిల్లో 65,648 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో 51,157 సీట్ల(77.93 శాతం)ను ప్రవేశాల కమిటీ విద్యార్థులకు కేటాయించగా, 14,491 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. ఇక 1,856 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నా సీట్లు లభించలేదు. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్టీఐలలో ప్రవేశాల కౌన్సెలింగ్ జూలై 19తో ముగియనుంది. ఆ తర్వాత మరో విడత కౌన్సెలింగ్‌ను నిర్వహించేందుకు ప్రవేశాల కమిటీ కసరత్తు చేస్తోంది.
జూలై 15లోగా ఫీజు చెల్లించండి...
కాలేజీల్లో సీట్లు లభించిన విద్యార్థులు అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకుని జూలై 15లోగా ట్యూషన్ ఫీజు చెల్లించి(వర్తించేవారు), సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని క్యాంపు అధికారి శ్రీనివాస్ వెల్లడించారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని, కాలేజీలో రిపోర్టు చేయని వారి సీటు రద్దవుతుందని చెప్పారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వారు 16వ తేదీలోగా సంబంధిత కాలేజీల్లో ఒక సెట్ జిరాక్స్ కాపీలు ఇవ్వాలని, చివరి దశ కౌన్సెలింగ్ పూర్తయ్యాకే ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని సూచించారు.
24 కాలేజీల్లో 50 మందిలోపే..
రాష్ట్రంలో 189 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే.. అందులో రెండు కాలేజీల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. మరో 7 కాలేజీల్లో 9 మందిలోపే విద్యార్థులు చేరగా, 24 కాలేజీల్లో 50 మందిలోపే విద్యార్థులు చేరారు. మరో 43 కాలేజీల్లో 100 మందిలోపు విద్యార్థులు చేరారు. 60 కాలేజీల్లో మాత్రం 100 శాతం కన్వీనర్ కోటా సీట్లు భర్తీ అయ్యాయి. అందులో 48 ప్రైవేటు కాలేజీలు ఉండగా, 12 యూనివర్సిటీ కాలేజీలు ఉన్నాయి.

Published date : 13 Jul 2018 02:27PM