తెలంగాణలో వెబ్ ఆప్షన్లకు 63,777 మంది విద్యార్థులు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో చేరేందుకు తెలంగాణలో 63,777 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్నారు.
జూన్ 22 నుంచి శుక్రవారం వరకు ఎంసెట్‌లో అర్హత సాధించి, ర్యాంకులు పొందిన 1,04,500 మంది విద్యార్థులను సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలువగా వెరిఫికేషన్ ప్రక్రియ ముగిసే వరకు 63,777 మంది విద్యార్థులు మాత్రమే (61.03 శాతం) వెరిఫికేషన్ చేయించుకున్నారు. ఈ వెరిఫికేషన్ చేయించుకున్న వారు మాత్రమే కన్వీనర్ కోటాలోని 70 శాతం సీట్లలో ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అర్హులు.
వెబ్‌సైట్‌లో వివరాలు:
కాలేజీలవారీగా చివరి ర్యాంకు వివరాలు, కోర్సువారీగా, కేటగిరీవారీగా, జెండర్‌వారీగా గత ఏడాది సీట్లు పొందిన విద్యార్థుల ర్యాంకుల వివరాలను తమ వెబ్‌సైట్‌లో tseamcet.nic.in అందుబాటులో ఉంచినట్లు ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వెబ్‌సైట్‌లోని ఆ వివరాలను పరిశీలించి, ఓ అవగాహనకు వచ్చాకే వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు.
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ వారికి 5 నుంచి..
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులై, ఇంజనీరింగ్ ఎంసెట్ ర్యాంకులు పొందిన 6,618 మంది విద్యార్థులకు ఈ నెల 5, 6 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టేందుకు ప్రవేశాల విభాగం అధికారులు చర్యలు చేపట్టారు. ఆ షెడ్యూల్‌ను ఒకటీ రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులై, ఎంసెట్‌లో ర్యాంకులు పొందిన విద్యార్థులతోపాటు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులై, ఎంసెట్ ర్యాంకులు పొందిన 6,618 మంది విద్యార్థులకు మొదటి దశ వెబ్ అప్షన్లలోనే అప్షన్లు ఇచ్చుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Published date : 02 Jul 2016 01:41PM