తెలంగాణలో ముగిసిన ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ముగిసింది.
ఈనెల 16న సీట్లు కేటాయించేందుకు ప్రవేశాల క్యాంపు కార్యాలయం చర్యలు చేపట్టింది. ఈసారి కన్వీనర్ కోటాలో సీట్ల సంఖ్యకు వెబ్ ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థుల సంఖ్య దగ్గరగా ఉంది. కన్వీనర్ కోటాలో 66,695 సీట్లు అందుబాటులో ఉండగా, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరై, వెబ్ ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులు 66,809 మంది ఉన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైన 68,299 మందిలో 1,400 మంది వెబ్ ఆప్షన్లు ఇవ్వలేదు. ఎంసెట్‌లో అర్హత సాధిం చిన 1.04 లక్షలమంది విద్యార్థుల్లో 62% వరకే ఆప్షన్లు ఇచ్చారు.
Published date : 14 Jul 2016 02:40PM