తెలంగాణలో జూన్ మూడో వారంలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్
Sakshi Education
హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌ను జూన్ మూడో వారంలో ప్రారంభించాలని ఎంసెట్ కమిటీ నిర్ణయించింది. ర్యాంకులను ఈ నెల 28న ఉదయం 11 గంటలకు విడుదల చేయనుంది.
తెలంగాణ ఉన్నత విద్యామండలి సమావేశ మందిరంలో మే 25న ఎంసెట్ కమిటీ సమావేశం జరిగింది. విద్యార్థుల నుంచి అభ్యంతరాలపై నిఫుణుల కమిటీ ఇచ్చిన నివేదికలను పరిశీలించింది. ఎంసెట్ ‘కీ’ల లో ఎలాంటి తప్పులు లేవని నిర్ధరణకు రావడంతో ఈనెల 28న ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించింది. వచ్చే నెల మూడో వారంలో ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభించి జూలై 31 నాటికి పూర్తి చేయాలని, ఆగస్టు 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించాలన్న ఏకాభిప్రాయానికి కమిటీ వచ్చింది. సమావేశంలో ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, ఎంసెట్ కన్వీనర్ రమణరావు పాల్గొన్నారు. అంతకుముందు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఉన్నతవిద్య, ఇంజనీరింగ్ ప్రవేశాలపై సమీక్షించారు.
Published date : 26 May 2015 12:09PM