Skip to main content

తెలంగాణలో జూన్ 8న ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు

సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా జూన్ 8న విద్యార్థులకు సీట్లను కేటాయించేందుకు ప్రవేశాల క్యాంపు కార్యాలయం ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 8 ఉదయం లేదా మధ్యాహ్నం విద్యార్థులకు సీట్ల కేటాయింపును ప్రకటించనుంది.
ఆ సమాచారాన్ని https://tseamcet.nic.in/Default.aspx అందుబాటులో ఉంచడంతోపాటు విద్యార్థులకు ఎస్సెమ్మెస్ రూపంలో తెలియజేయనుంది. ఈసారి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న వారందరికీ సీట్లను కేటాయించినా కన్వీనర్ కోటాలో మరో 6,898 సీట్లు మిగిలిపోనున్నాయి. మొత్తంగా ఎంసెట్ ఇంజనీరింగ్‌లో 96,703 మంది అర్హత సాధించినా ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనకు 59,033 మంది పాల్గొన్నారు. అందులో 58,048 మంది విద్యార్థులు మే 28 నుంచి జూన్ 5వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి మాత్రమే సీట్లను కేటాయించనున్నట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా కన్వీనర్ కోటాలోని 70% సీట్లను (64,946), మిగతా 30% సీట్లను యాజమాన్య కోటాలో కాలేజీలు భర్తీ చేస్తాయని తెలిపారు.

ఇవీ విద్యార్థులు, సీట్ల వివరాలు..

ఎంసెట్‌లో అర్హులు

96,703

ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైనవారు

59,033

వెబ్ ఆప్షన్లు ఇచ్చినవారు

58,048

విద్యార్థులు ఇచ్చిన మొత్తం ఆప్షన్లు

28,96317

ఇంజనీరింగ్ కాలేజీల్లో మొత్తం సీట్లు

95,775

జనీరింగ్‌లోకన్వీనర్ కోటా సీట్లు

64,946

కన్వీనర్ కోటాలో బీఫార్మసీ సీట్లు

2,229

కన్వీనర్ కోటాలో ఫార్మా-డీ సీట్లు

150

Published date : 08 Jun 2018 01:52PM

Photo Stories