తెలంగాణ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు నేడే
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంజనీరింగ్ ప్రవేశాల్లో సీట్ల కేటాయింపును శుక్రవారం (24న) సాయంత్రం ప్రకటించేందుకు ప్రవేశాల క్యాంపు కార్యాలయం ఏర్పాట్లు చేస్తోంది.
రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లోని కన్వీనర్ కోటాలో 86,103 సీట్లు ఉండగా, 62,457 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో 61,662 మంది మాత్రమే మొదటి దశలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వీరందరికీ శుక్రవారం సీట్లు కేటాయించనున్నారు.
Published date : 24 Jul 2015 01:23PM