టామ్‌కామ్ టార్గెట్ బీటెక్!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: బీటెక్, ఎంసీఏ తదితర టెక్నాలజీ విద్యనభ్యసించిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీస్ (టామ్‌కామ్) ప్రణాళికలు రచిస్తోంది.
ఇప్పటికే గల్ఫ్ దేశాల్లోని కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని స్కిల్డ్, అన్‌స్కిల్డ్ రంగాల్లోని వారికి టామ్‌కామ్ ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. ప్రభుత్వ అధీనంలోని టీఎస్ ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థుల డేటాబేస్ సేకరిస్తున్నా.. ఆశించిన స్థాయిలో సమాచారం సమకూరడం లేదని టామ్‌కామ్ భావిస్తోంది. దీంతో ప్రత్యేకమైన వ్యవస్థ ఏర్పాటు చేసుకునేందుకు ఐటీ విభాగాన్ని సాంకేతిక సహకారం అందించాలని కోరింది. తద్వారా బీటెక్, ఎంసీఏ వంటి కోర్సులు చదివిన వారి వివరాలు సేకరించి ఐటీ కంపెనీలతో చర్చలు జరపాలని నిర్ణయించింది.
Published date : 15 Jul 2016 05:43PM