Skip to main content

Engineering: ఇంజనీరింగ్‌ కాలేజీలకు షోకాజ్‌ నోటీసులు

అనుబంధ ఇంజనీరింగ్‌ కళాశాలలపై జేఎన్ టీయూ (అనంతపురం) యాజమాన్యం కన్నెర్ర చేసింది.
Engineering
ఇంజనీరింగ్‌ కాలేజీలకు షోకాజ్‌ నోటీసులు

ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీకి త్వరలో కౌన్సెలింగ్‌ నిర్వహించనుండగా.. ఇదే తరుణంలో యాజమాన్యాలకు ఊహించని షాక్‌ ఇచ్చింది. మొత్తం 22 కళాశాలలకు సెప్టెంబర్‌ 28న షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఇందులో 6 కళాశాలలు అనుబంధ గుర్తింపునకు దరఖాస్తు చేయడంలో జాప్యం వహించాయి. 7 కళాశాలల్లో సరైన మౌలిక సదుపాయాలు లేవు. మిగిలిన 9 కాలేజీలు యూనివర్సిటీ కామన్ సర్వీసెస్‌ (యూసీఎస్‌) ఫీజులు చెల్లించలేదు. ఈ నేపథ్యంలో కళాశాలల గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో తెలుపుతూ రెండు రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని జేఎన్ టీయూ (అనంతపురం) నోటీసులు జారీ చేసింది.

చదవండి: 

Engineering: ఇంజనీరింగ్‌పై తగ్గుతున్న క్రేజ్‌: ఏఐసీటీఈ

Engineering: బీ కేటగిరీ సీట్లకు అందరి దరఖాస్తులు తీసుకోవాలి

Published date : 29 Sep 2021 03:48PM

Photo Stories