Skip to main content

సర్కారు కాలేజీలు సూపర్..

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీల కన్నా ప్రభుత్వ డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలే మంచి పనితీరు కనబరుస్తున్నాయి.
ఉత్తీర్ణత శాతం విషయంలో ప్రభుత్వ కాలేజీల్లోని విద్యార్థులే మంచి ఫలితాలు సాధిస్తున్నట్లు తేలింది. విద్యా రంగంలో తీసుకురావాల్సిన సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ.. ఉన్నత విద్యలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని కాలేజీల పనితీరును అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. నివేదికలో కమిటీ పేర్కొన్న ముఖ్యాంశాలివీ..
  • ప్రభుత్వ రంగంలోని డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం మెరుగ్గా ఉండగా ప్రైవేట్ సంస్థల్లో బాగా తక్కువగా ఉంది.
  • ప్రైవేట్ కాలేజీల్లో విద్యా ప్రమాణాలు సన్నగిల్లిపోగా.. మౌలిక వసతులు కూడా సక్రమంగా లేవు.
  • 71% ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు (817) అద్దె భవనాల్లో పనిచేస్తున్నాయి.
  • అలాగే.. 40 శాతం ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో (464) 25 శాతం కన్నా తక్కువగా అడ్మిషన్లు జరుగుతున్నాయి.
  • 58 శాతం ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో (185)నూ 50% కన్నా తక్కువగానే అడ్మిషన్లు జరుగుతున్నాయి.
దీంతో రాష్ట్రంలో మొత్తం 1,153 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలుండగా అందులో 500 కాలేజీలను మూసివేయాలని కమిటీ తేల్చింది. అలాగే, మొత్తం 287 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలుండగా అందులో 200 కాలేజీలను మూసేయవచ్చునని కమిటీ సూచించింది.

ఉత్తీర్ణతలో ‘ప్రైవేట్’ అథమం:
ఆంధ్రప్రదేశ్‌లోని 1,153 ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ఉత్తీర్ణత కేవలం 30 శాతమే ఉందని, అంతేకాక.. ఈ కాలేజీల్లో 40% మంది తుది పరీక్షకు గైర్హాజరవుతున్నారని కమిటీ గుర్తించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని కొన్ని కాలేజీలను కూడా సంస్కరించాల్సి ఉందని అభిప్రాయపడింది. అలాగే, 25 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలతో పాటు 40 ఎయిడెడ్ కాలేజీల్లో 25% కన్నా తక్కువగా అడ్మిషన్లు ఉంటున్నాయని తెలిపింది. మరోవైపు.. గత సర్కారు 13 ప్రభుత్వ కాలేజీలను మంజూరుచేసి చేతులు దులుపుకుందని, వాటికి సిబ్బందిని మంజూరు చేయలేదని కమిటీ పేర్కొంది.

ఉన్నత విద్యా సంస్థల్లో సీట్ల మంజూరు, భర్తీ.. ఉత్తీర్ణతా శాతం వివరాలు:
విద్యా సంస్థలు కాలేజీలు మంజూరైన సీట్లు భర్తీ అయిన సీట్లు ఉత్తీర్ణత శాతం
ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు 1,153 3,17,393 1,39,778 30.00
ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు 151 52,506 34,050 73.66
ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు 137 66,346 41,834 68.46
ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు 287 1,74,385 69,130 57.00
ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు 20 4,834 4,307 87.00
ఎంబీఏ ప్రభుత్వ, ఎయిడెడ్ 352 43,839 29,158 52.00
పాలిటెక్నిక్ ప్రభుత్వ, ఎయిడెడ్ 86 16,010 12,487 73.50
ప్రైవేట్ పాలిటెక్నిక్ 209 52,706 25,676 57.00

ప్రభుత్వానికి విద్యా సంస్కరణ కమిటీ నివేదిక : ప్రభుత్వ కాలేజీల్లో..
151 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఉత్తీర్ణత ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉత్తీర్ణత
73.66% 87%

ప్రైవేట్ కాలేజీల్లో..
1153 డీగ్రీ కాలేజీల్లో ఉత్తీర్ణత తుది పరీక్షకు గైర్హాజరైన వారు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉత్తీర్ణత
30% 40% 57%

ప్రమాణాలు పాటించనివి..
డిగ్రీ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం మూసేయాల్సిన కాలేజీలు
500 200 700
Published date : 04 Nov 2019 04:59PM

Photo Stories