Skip to main content

సివిల్ ఇంజనీరింగ్ పట్టభద్రులకు ఉద్యోగ శిక్షణ

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఎస్సీ అభ్యర్థుల కోసం ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టింది.
శిక్షణ ఇచ్చి, క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగం పొందేలా అభ్యర్థులను తీర్చిదిద్దే బాధ్యతలను నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్)కు అప్పగించింది. ఈ మేరకు భవన నిర్మాణంలో ప్రతిభకు సాన పట్టి ప్రైవేటు నిర్మాణ సంస్థల్లో ఉద్యోగాలు పొందేలా అభ్యర్థులను న్యాక్ సిద్ధం చేస్తుంది. ఆయా నిర్మాణ సంస్థలను అభ్య ర్థుల ముంగిటకే రప్పించి ప్లేస్‌మెంట్ చూపిస్తుంది. ఈ కొత్త కార్యాచరణను తాజాగా న్యాక్ ప్రారంభించింది. సివిల్ ఇంజనీరింగ్‌లో బీఈ, బీటెక్ పూర్తి చేసిన ఎస్సీ అభ్యర్థుల్లో ఎక్కువ మంది నిరుద్యోగులుగా ఉన్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో వారికి ఉపాధి అవకా శాలు కల్పించే బాధ్యతను న్యాక్‌కు అప్పగించింది. ఈ నేపథ్యంలో న్యాక్ డెరైక్టర్ జనరల్ భిక్షపతి.. సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన కొంతమందితో చర్చించి సమస్యకు కారణాలను విశ్లేషించారు. ఇంజనీరింగ్‌లో ప్రాక్టికల్ అవగాహన అవసరమని, ఇందుకు కనీసం మూడు నెలలపాటు భవన నిర్మాణ రంగంలో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదించారు. దీనికి ప్రభుత్వం అంగీకరించటంతో బ్యాచ్‌లవారీ శిక్షణకు ప్రణాళిక రూ పొందించారు. భవన నిర్మాణానికి సంబంధించిన సర్వే, ఆటో క్యాడ్, మెటీరియల్ క్వాలిటీ పరీక్ష, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్, సిమెంట్ పని, రంగులు వేయటం వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు. మూడు నెలల శిక్షణ తర్వాత నిర్మాణ సంస్థలతో క్యాంపస్ ఇంటర్వ్యూలు ఏర్పాటు చేయనున్నారు. శిక్షణ వ్యయాన్ని ఎస్సీ కార్పొరేషనే భరిస్తుంది. ఇందులో భాగంగా 30 మందితో తొలి శిక్షణ తరగతులు మొదలయ్యాయి. మరో నెల తర్వాత రెండో బ్యాచ్ శిక్షణ ప్రారంభించనున్నారు.

ఎస్సీ అభ్యర్థులకు మంచి అవకాశం :
‘తరగతుల్లో పుస్తకాల్లోని అంశాలను బోధిస్తారు. విద్యా ర్థులకు క్షేత్రస్థాయి పరిజ్ఞానం అంతగా ఉండదు. దీంతో ఇంటర్వ్యూల్లో తిరస్కరణకు గురవుతున్నారు. చాలా మంది సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులది ఇదే సమస్య. ఆ గ్యాప్‌ను పూడ్చాలంటే వారికి శిక్షణ అవసరం. ఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం గొప్ప అవకాశం కల్పించింది. దీన్ని వారు వినియోగించుకుంటే ఉపాధికి మార్గం సుగమం అవుతుంది. ఎన్నో కంపెనీలు వారిని నియమించుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి’ అని న్యాక్ డెరైక్టర్ జనరల్ భిక్షపతి పేర్కొన్నారు.
Published date : 03 Apr 2017 01:37PM

Photo Stories