రేపు తెలంగాణ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ముగియడంతో ఈ నెల 16న సీట్లు కేటాయించేందుకు ప్రవేశాల క్యాంపు కార్యాలయం చర్యలు చేపట్టింది.
కన్వీనర్ కోటాలో 66,695 సీట్లు అందుబాటులో ఉండగా, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరై, వెబ్ ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులు 66,809 ఉన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైనా దాదాపు 1,400 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇవ్వలేదు. ఎంసెట్‌లో అర్హత సాధించిన దాదాపు 1.04 లక్షల మంది విద్యార్థుల్లో 62 శాతం మందే ఆప్షన్లు ఇచ్చారు. అందులోనూ అందరికి సీట్లు లభించకపోవచ్చని, తక్కువ ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులు చివరి దశ కౌన్సెలింగ్‌కు వెళ్లాల్సిన అవసరం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈసారి కూడా సీట్లు మిగిలిపోనున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 30 వేల సీట్లకు కోత పడింది. అందులోనూ సీట్లు మిగిలే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గతేడాది 1.26 లక్షల సీట్లలో ప్రవేశాలకు వర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇవ్వగా మొత్తంగా 75 వేల సీట్లే భర్తీ అయ్యాయి. ఈసారి దాదాపు 95 వేల సీట్లకు అనుమతి ఇవ్వగా అందులో భర్తీ అయ్యే సీట్లు 75 వేల వరకు ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

Published date : 15 Jul 2016 05:42PM