రేపు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు సర్వం సిద్ధం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను ఈ నెల 25న నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపరు-1, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పేపరు-2 పరీక్ష ఉంటుంది. పరీక్షకు జేఈఈ-మెయిన్‌లో తొలి 1,54,000లోపు ర్యాంకు సాధించిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఈ పరీక్షకు రాష్ట్రం నుంచి 21,818 మంది అర్హత సాధించారు. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, విశాఖపట్నం పట్టణాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జూన్ 1న వెబ్‌సైట్‌లో ‘కీ’ను పెడుతారు, 19న ఫలితాలు విడుదల చేస్తారు.
Published date : 24 May 2014 12:36PM