ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లకు ఆధార్ తప్పనిసరి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు సంబంధించిన మెరిట్ స్కాలర్‌షిప్‌లు, ఇతర ప్రభుత్వ సబ్సిడీలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఆధార్ నంబరు కచ్చితంగా అందజేయాలని, బ్యాంకు అకౌంట్లకు ఆధార్‌ను లింకు చేసుకోవాలని తెలంగాణ ఇంటర్మీయెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
వచ్చే డిసెంబరు 31 లోగా ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ స్పష్టం చేసిందని, లేదంటే స్కాలర్‌షిప్‌లు, సబ్సిడీలు అందవని పేర్కొంది. ఆధార్ లింకు చేసేందుకు అవసరమైన వివరాలను ఆధార్ వెబ్‌సైట్‌లోనూ పొందవచ్చని తెలిపింది.
Published date : 23 Jul 2016 03:09PM