ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల దోపిడీపై ఏపీ పభుత్వం కొరడా!!
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక ఫీజులు వసూలు చేస్తూ ప్రజాధనాన్ని దోచుకుంటున్న పలు ఇంజనీరింగ్ కాలేజీలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది.
దోపిడీని అరికట్టేందుకు
ఈ దోపిడీని అరికట్టి, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చేసేందుకు, విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు, తల్లిదండ్రులపై భారం లేకుండా చూసేందుకు వీలుగా సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ను ఏర్పాటుచేయించడమే కాకుండా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటును చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. కమిషన్ సిఫార్సుల మేరకు కాలేజీలకు 2019-20 విద్యా సంవత్సరపు ఫీజులతో పాటు గత ప్రభుత్వం బకాయిగా ఉంచిన రూ.1,850 కోట్లతో సహా పూర్తి ఫీజు బకాయిలను చెల్లించారు.
విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు రావడం, రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక పరిశీలనలో విస్తుపోయే అనేక అక్రమాలు వెలుగుచూడడంతో ఈ కాలేజీల దోపిడీపై మరింత లోతుగా దర్యాప్తు, తదనంతర చర్యలకు అవినీతి నిరోధక శాఖ, సీఐడీ విభాగాలకు ఈ వ్యవహారాన్ని అప్పగించనుంది.
- గత ప్రభుత్వ హయాంలో 2016-2019 విద్యా సంవత్సరాలకు సంబంధించి అప్పటి ఏఎఫ్‌ఆర్‌సీ నిర్ధారించిన ఫీజుల్లో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి.
- చంద్రబాబు సీఎంగా వచ్చాక పూర్తి ఫీజును కాకుండా కేవలం రూ.35వేలు మాత్రమే ప్రభుత్వపరంగా చెల్లించగా మిగతా మొత్తాన్ని తల్లిదండ్రులు భరించాల్సి వచ్చేది. వాస్తవానికి ఆ కాలేజీల విద్యా కార్యక్రమాల నిర్వహణ ఖర్చులను బట్టి ఏటా రూ.25వేల నుంచి రూ.35వేలలోపే ఫీజు వసూలుచేయాలి. కానీ, రూ.30వేల నుంచి 40వేల వరకు అదనంగా ఖరారు చేయించుకుని దోచుకున్నాయి.
- విచిత్రమేమంటే.. 2016-19 విద్యా సంవత్సరాలకే కాకుండా ఆ తరువాత కూడా అదనంగా వసూలు చేసుకునేలా జాగ్రత్తపడ్డారు.
- ఈ దోపిడీని అరికట్టేందుకు సీఎం వైఎస్ జగన్ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ను ఏర్పాటుచేశారు. అయితే.. కొన్ని కాలేజీలు తమకు పాత ఏఎఫ్‌ఆర్‌సీ నిర్ణయించిన ఫీజులు అమలుచేయాలని కోర్టులను ఆశ్రయించాయి.
- నిజానికి ఫీజులను విద్యా కార్యక్రమాలకే ఖర్చుచేయాలి. కానీ, ఈ కాలేజీలు వాటిని తమ స్వప్రయోజనాలకు ఉపయోగించుకున్నాయి.
- దీంతో ఈ మొత్తం వ్యవహారాన్ని ఏసీబీ, సీఐడీ విభాగాలకు అప్పగించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
- కాలేజీల యాజమాన్యాలపైనే కాకుండా అప్పటి ఏఎఫ్‌ఆర్‌సీ అధికారులపైనా చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.
- అలాగే, 25 శాతం కన్నా తక్కువ చేరికలు ఉన్నప్పటికీ కాలేజీలను కొనసాగిస్తున్న యాజమాన్యాలపైనా చర్యలు తీసుకోనున్నారు.
- ఆ కాలేజీల గుర్తింపు రద్దుతోపాటు ఇతర చట్టపర చర్యలకు వీలుగా జాబితాను ప్రభుత్వం ఆయా యూనివర్సిటీలకు పంపింది.
- కాలేజీల దోపిడీ ఎలా ఉందంటే.. గుంటూరు జిల్లాలోని ఒక కాలేజీకి వాస్తవానికి రూ.27,734 మాత్రమే ఫీజుగా నిర్ణయించాల్సి ఉన్నా దానికి ఏకంగా రూ.54,500లు, కృష్ణా జిల్లాలోని మరో కాలేజీకి వాస్తవిక ఫీజు రూ.35,635గా ఉండగా దానికి గత ఏఎఫ్‌ఆర్‌సీ రూ.66వేలు, విజయనగరం జిల్లాలోని ఒక కాలేజీకి వాస్తవిక ఫీజు రూ.30,885గా ఉండాల్సి ఉండగా దానికి 59,900గా ఖరారుచేశారు. ఇలాంటి అక్రమాలు గత ప్రభుత్వ హయాంలో అనేకం జరిగాయి.
దోపిడీని అరికట్టేందుకు
ఈ దోపిడీని అరికట్టి, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చేసేందుకు, విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు, తల్లిదండ్రులపై భారం లేకుండా చూసేందుకు వీలుగా సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ను ఏర్పాటుచేయించడమే కాకుండా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటును చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. కమిషన్ సిఫార్సుల మేరకు కాలేజీలకు 2019-20 విద్యా సంవత్సరపు ఫీజులతో పాటు గత ప్రభుత్వం బకాయిగా ఉంచిన రూ.1,850 కోట్లతో సహా పూర్తి ఫీజు బకాయిలను చెల్లించారు.
Published date : 14 Aug 2020 12:38PM