ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం దొంగ అడ్మిషన్లు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఫీజుల మాయాజాలం కొనసాగిస్తున్నాయి. కనీస వసతులు కూడా లేకున్నా అన్నీ ఉన్నట్లుగా కనికట్టు చేస్తున్నాయి.
విద్యార్థుల ప్రవేశాల విషయంలో తప్పుడు లెక్కలు చూపిస్తూ ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కొల్లగొడుతున్నాయి. స్పెషలైజ్డ్ కోర్సుల పేరిట విద్యార్థుల నుంచి విచ్చలవిడిగా ఫీజులను దండుకుంటున్నాయి. ప్రైవేట్ కాలేజీలు బీకాం కంప్యూటర్స్, బీఎస్సీ కంప్యూటర్స్, బీకాం ట్యాక్సేషన్ అంటూ వేర్వేరు పేర్లతో ఈ స్పెషలైజ్డ్ కోర్సులకు అనుమతులు పొందుతున్నాయి. తగినన్ని కంప్యూటర్లు, ల్యాబ్‌లు, అర్హులైన లెక్చరర్లు లేకున్నా ఉన్నట్లు కాగితాల్లో చూపిస్తున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి సర్వే చేయకుండానే, ఇష్టానుసారంగా కొత్త కోర్సులకు అనుమతులు ఇచ్చేశారు.
సర్కారు ఖజానాకు గండి
రాష్ట్రంలో 1,432 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 151 ప్రభుత్వ, 128 ప్రైవేట్ ఎయిడెడ్, 1,153 ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కాలేజీలున్నాయి. రాష్ట్రంలోని 10 యూనివర్సిటీల పరిధిలోని ఈ కాలేజీల్లో 2019-20లో మొదటి సంవత్సరంలో దాదాపు 2,48,413 మంది ప్రవేశాలు పొందారు. మూడేళ్లకు కలిపి విద్యార్థుల సంఖ్య 7.45 లక్షలకు చేరుతుంది. వీరిలో సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో చేరే వారి సంఖ్య తక్కువే. మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న ఉద్దేశంతో స్పెషలైజ్డ్ కోర్సుల్లో ఎక్కువ మంది చేరుతున్నారు. ప్రైవేట్ కాలేజీలు కూడా అధిక ఫీజుల కోసం, ప్రభుత్వం నుంచి వస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఇలాంటి స్పెషలైజ్డ్ కోర్సులకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఏజెంట్లను నియమించుకొని, ఇంటర్మీడియట్ పాసయిన విద్యార్థులకు తాయిలాలు ఆశచూపి తమ కాలేజీల్లో చేర్చుకుంటున్నాయి. అంతేకాకుండా కాలేజీ హాస్టళ్లలో చేరని విద్యార్థుల పేరిట ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు స్కాలర్‌షిప్‌లను సైతం తీసుకుంటున్నాయి. విచిత్రం ఏమిటంటే ఇంజనీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో మేనేజ్‌మెంట్ కోటా కింద చేరిన వారిని సైతం డిగ్రీ కోర్సుల్లో చేరినట్లు చూపిస్తున్నాయి. వారి పేరిట సర్కారు నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్ము నొక్కేస్తున్నాయి.

Published date : 29 Feb 2020 02:11PM