Skip to main content

పపంచ రికార్డు...తొమ్మిదేళ్లకే ఇంజనీరింగ్ పట్టా

సాక్షి, స్టూడెంట్ ఎడిషన్: సాధారణంగా తొమ్మిదేళ్ల కుర్రాడు ఏ తరగతి చదువుతుంటాడు? ఏ నాలుగో తరగతో మహా అంటే ఐదో తరగతో అంటారా? కానీ ఓ బాలుడు ఏకంగా ఇంజనీరింగ్ పూర్తిచేశాడు! అంతేకాదు..
అత్యంత పిన్న వయస్సులో డిగ్రీ పట్టా అందుకోనున్న వ్యక్తిగా ప్రపంచ రికార్డు సృష్టిం చాడు!! నమ్మలేకపోతున్నారా? అయితే, ఇది చదివే యండి మరి. నెదర్లాండ్‌‌సలోని ఆమ్‌స్టర్‌డాంలో నివసించే లిదియా, అలెగ్జాండర్ సిమ్మన్‌‌స దంపతుల కుమారుడు లారెంట్ సిమ్మన్‌‌స. వయసు తొమ్మిదేళ్లు. చిన్నప్పటి నుంచే అసాధారణ ప్రజ్ఞాపా టవాలు కలిగిన లారెంట్ ప్రస్తుతం ఇందోవన్ యూనివర్సిటీ ఆఫ్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ప్రస్తుతం ఫైనల్ ఎగ్జామ్స్ రాసిన లారెంట్ డిసెంబర్‌లో పట్టా అందుకోనున్నాడు. తద్వారా అతి పిన్న వయస్సులోనే డిగ్రీ పూర్తిచేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నాడు. లారెంట్ కంటే ముందు మైఖేల్ కెర్నీ 10 ఏళ్ల వయస్సులో ఈ ఘనత అందుకున్నాడు. కాగా, లారెంట్ ఘనత గురించి అతని తల్లిదండ్రులు మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే తమ కుమారుడి ప్రతిభా పాటవాలు(ఐక్యూ 145) అసాధారణంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. లారెంట్ కేవలం చదువుకు మాత్రమే అంకితమైపోలేదని, ఆటపాటల్లోనూ ముందున్నాడని పేర్కొన్నారు. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉన్నాడని, లారెంట్ ఇన్‌‌ట్రాగామ్ ఖాతాలో 11వేల మంది ఫాలోవర్లు ఉన్నారని చెప్పుకొచ్చారు. కాగా, తొమ్మిదేళ్లకే డిగ్రీ పూర్తి చేయడం తనకు ఆనందంగా ఉందన్న లారెంట్.. కేంబ్రిడ్‌‌జ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.
Published date : 16 Nov 2019 01:54PM

Photo Stories