పిన్నవయసులోనే ఇంజనీరింగ్
Sakshi Education
న్యూఢిల్లీ: పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని అంటే పిన్న వయస్సులోనే గొప్ప పనులు చేసి పేరు ప్రఖ్యాతులు సాధించటం.
అందుకు చక్కని ఉదాహరణ సంహిత. చిన్ననాటి నుంచే అన్ని విషయాల్లోనూ క్రియాశీలకంగా ఉండేది. మూడేళ్ల వయస్సులోనే సంహిత 200 దేశాల పేర్లు, వాటి రాజధానులను తడబడకుండా చెప్పేది. అంతే కాకుండా ఐదేళ్ల వయస్సులోనే అంతరిక్షంపై 15 పేజీల వ్యాసం రాసి అప్పటి రాష్ట్రపతి కలాం అభినందనలు పొందింది. 10 సంవత్సరాలకే 10వ తరగతి చదివి 8.8 జీపీఏ సాధించింది. ఇంకా 12 ఏళ్ళకే ఇంటర్మీడియట్ ఎంపీసీతో పూర్తిచేసి 89 శాతం మార్కులు సాధించిన అతిపిన్న వయస్కు రాలు. 12వ ఏట హైదరాబాద్‌లోని సీబీఐటీ కళాశాలలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో సీటు సాధించింది. ఇంజనీరింగ్ చివరి సంవత్సరం బంగారు పతకం సాధించింది. దేశంలోనే అతిపిన్న వయస్సులోనే ఇంజనీరింగ్ పూర్తిచేసిన ఘనత కూడా ఆమెకే దక్కింది. అంతేగాక కేవలం 100 రోజుల ప్రిపరేషన్‌తో క్యాట్‌లో 95.95 పర్సంటేజ్ తెచ్చుకున్న అపరమేధావి. అంతేకాకుండా కేవలం 17 ఏళ్ల వయస్సులో క్యాట్ ఈ స్కోర్ సాధించిన మొట్టమొదటి వ్యక్తి. కేవలం చదువులోనే కాకుండా ఇతర కళలలో కూడా విశేషమైన ప్రతిభ ఈ యువతి సొంతం.
Published date : 21 Aug 2019 04:12PM