పీజీ ఇంజనీరింగ్ కోర్సులను ఎత్తివేస్తున్న యాజమాన్యాలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్ : పీజీ ఇంజనీరింగ్‌లో (ఎంటెక్) ఈసారి భారీగా సీట్లు తగ్గిపోనున్నాయి. ఇందుకోసం పలు కాలేజీల యాజమాన్యా లు వర్సిటీలకు దరఖాస్తు చేసుకున్నాయి. ఎంటెక్ కోర్సుల నిర్వహణ సమస్యగా మారడం తో ఈ నిర్ణయానికి వచ్చాయి.
వర్సిటీల నిబంధనల ప్రకారం ప్రతి ఎంటెక్ కోర్సులో 12 మంది విద్యార్థులకు ఒక పీహెడ్‌డీ అధ్యాపకుడు తప్పనిసరిగా ఉండాలన్న నిబంధన ఉంది. విద్యార్థులు పెద్ద గా కాలేజీలకు రాకపోవడం, చేరే వారి సంఖ్య కూడా తగ్గిపోతుండటంతో వేతన భారం తప్పించుకునేందుకు కాలేజీలు ఎంటెక్ కోర్సులను రద్దు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నా యి. ఈ నేపథ్యంలో ఈసారి 2 వేల సీట్ల రద్దుకు యాజమాన్యాలు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. అలాగే అధ్యాపకులను తొలగిస్తున్నట్లు సమాచా రం పంపించడంతో వారు ఆందోళనలో పడ్డారు. ఇటీవల నగర పరిసరాల్లోని ఓ కాలేజీ యాజమాన్యం ఓ అధ్యాపకున్ని తొలగిస్తున్నట్లు ఫోన్‌ద్వారా మెసేజ్ పంపించి అదే తొలగింపు ఆర్డర్ గా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. దీంతో ఆయన ఆందోళనలో పడ్డారు. ఇది ఆయ న ఒక్కరి పరిస్థితే కాదు..రాష్ట్రంలోని అనేక మంది పరిస్థితి ఇదే కావడంతో ఆందోళన నెలకొంది.
Published date : 15 Apr 2020 05:55PM