పైవేటువర్సిటీల ఏర్పాటుకు రెడీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణా రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పా టు చేసేందుకు 4 ప్రముఖ సంస్థలు ముందుకొచ్చాయి.
టెక్ మహీంద్ర, వోక్సన్, ర్యాడిక్లిఫ్, శ్రీనిధి సంస్థలు వర్సిటీల ఏర్పాటుకు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్నాయి. ఆయా సంస్థలు తాము ఏర్పాటు చేయబోయే వర్సిటీలకు సంబంధించిన ప్రాజెక్టులపై ప్రైవే టు వర్సిటీల కమిటీ ముందు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాయి. త్వరలో వోక్సన్ సంస్థ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. గురునానక్, మల్లారెడ్డి, ఎస్‌ఆర్, సెయింట్ మేరీస్, వాగ్దేవి విద్యాసంస్థలూ ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు ఉన్నత విద్యాశాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయి.
Published date : 06 Nov 2019 04:59PM