ఓయూలో ఎంబీఏ, ఇంజనీరింగ్ పరీక్షలు వారుుదా
Sakshi Education
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో నేడు (ఈ నెల 16న) జరగాల్సిన ఎంబీఏ, ఇంజనీరింగ్ బ్యాక్‌లాగ్ పరీక్షలను వారుుదా వేసినట్లు కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ తెలిపారు. అలాగే ఈ నెల 14న వారుుదా పడ్డ బీఏ, బీకాం, బీఎస్సీ, ఇతర డిగ్రీ కోర్సుల పరీక్షలను ఈ నెల 18న (ఆదివారం) నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ నెల 19 నుంచి ప్రారంభంకానున్న ఓయూ పీజీ ఫైనలియర్ చివరి సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నేటి నుంచి (ఈ నెల 16) హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. జిల్లా కేంద్రాల్లో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల మొబైల్ ఫోన్‌లకు లింక్ ఇచ్చినట్లు దాని ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ కాని వారు ఒక ఫొటో, గుర్తింపు కార్డుతో పరీక్షా కేంద్రంలోని చీఫ్ సూపరింటెండెంట్‌ను కలిసి డూప్లికేట్ హాల్‌టికెట్‌ను తీసుకొని పరీక్ష రాయవచ్చన్నారు.
Published date : 16 Oct 2020 03:28PM