ముగిసిన‘నాటా’ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ
Sakshi Education
హైదరాబాద్: నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ఆర్కిటెక్చర్(నాటా)- 2014 తొలివిడత వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన‘నాటా’ ప్రవేశ పరీక్షలో మొత్తం 856 మంది అర్హత సాధించగా, వెబ్ఆప్షన్ల ప్రక్రియలో 853 మంది పాల్గొన్నట్టు అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం 10గంటలకు సీట్ల కేటాయింపు చేయనున్నారు. అలాట్మెంట్ లెటర్లు అందుకున్న అభ్యర్థులు వారికి కేటాయించిన కళాశాలల్లో ఈనెల 16లోగా రిపోర్టు చేయాలి. సీట్లను రద్దు చేసుకోవాలనుకునే వారికి చివరి తేది ఈనెల 18. మిగిలిన సీట్ల భర్తీకై 22 నుంచి మలివిడత వెబ్కౌన్సెలింగ్(ఆప్షన్ల ప్రక్రియ)ను నిర్వహించనున్నారు. 24లోగా అడ్మిషన్ల ప్రక్రి యను పూర్తిచేయనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
Published date : 15 Sep 2014 01:26PM