మరోసారి తెలంగాణ ఈసెట్ వెబ్ ఆప్షన్లు మార్చుకునే అవకాశం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు తెలంగాణలో ఈసెట్ రాసిన విద్యార్థులు మరోసారి ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం కల్పించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది.
ఈసెట్ ద్వారా ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థుల్లో 1,000లోపు ర్యాంకు సాధించిన విద్యార్థులకూ రీయింబర్స్‌మెంట్‌ను వర్తింపజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఈసెట్ ద్వారా చేరే విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్ ఇచ్చే వారు కాదు. అయితే తాజాగా ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో వాటికి సంబంధించిన ఉత్తర్వులు ఒకట్రెండు రోజుల్లో ప్రవేశాల క్యాంపు కార్యాలయానికి అందే అవకాశముంది. గతంలో రీయింబర్స్‌మెంట్ లేనందున ఈనెల 11 వరకు చేపట్టిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియలో ఎక్కువ ఫీజులు ఉన్న కాలేజీలను విద్యార్థులు ఎంచుకోలేదు. అయితే 1,000 ర్యాంకులోపు ఉన్న వారికి వర్తిం పజేయనుండటంతో ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం కల్పించినట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు.
Published date : 13 Jul 2015 02:54PM