మే 9న ఈసెట్ పరీక్ష
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయిన విద్యార్థులు ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు ఈసెట్-2018 పరీక్షను మే 9న నిర్వహిం చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ ఈసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు.
ఈ పరీక్షకు 27,657 మంది హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, విద్యార్థులు 8.30 గంటలకే పరీక్ష కేంద్రంలో రిపోర్టు చేయాలని సూచించారు. ఆలస్యంగా వస్తే ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని, పరీక్ష ఆన్‌లైన్‌లో ఉంటుందని తెలిపారు.
Published date : 08 May 2018 03:38PM