కేఎల్ వర్సిటీలో పెట్రోలియం ఇంజనీరింగ్ కోర్సు
Sakshi Education
హైదరాబాద్: దక్షిణాదిలో తొలి డీమ్డ్ వర్సిటీ అయిన కేఎల్ యూనివర్సిటీ బీటెక్‌లో కొత్తగా పెట్రోలియం ఇంజనీరింగ్ కోర్సును ప్రవేశపెట్టింది. కోస్తాంధ్రలో పెట్రోకారిడార్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో పెట్రోలియం రంగంలో ఉపాధి అవకాశాలు అందించేలా ఈ కోర్సును రూపొందించినట్లు యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. రిలయన్స్, ఓఎన్‌జీసీ, గెయిల్ వంటి ప్రముఖ కంపెనీల్లో అవకాశాలు పొందేలా వర్సిటీ వందశాతం ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్ కూడా ఇవ్వనుందని పేర్కొన్నాయి. అడ్మిషన్లు, ఇతర వివరాలకు ప్రొఫెసర్ శ్రీనివాసులును 9848487715 ఫోన్ నెంబర్‌లో సంప్రదించవచ్చు. వర్సిటీ వెబ్‌సైట్ ( www.kluniversity.in )ను సందర్శించి కూడా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
Published date : 16 Jul 2014 11:50AM