జూన్ 24నే తుది ర్యాంకులు
Sakshi Education
ముందస్తుగా జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంకులు
హైదరాబాద్: జాతీయ స్థాయి విద్యా సంస్థలైన ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలను త్వరగా పూర్తి చేసి, సకాలంలో తరగతులను ప్రారంభించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది.
ప్రతి ఏటా ప్రవేశాల్లో జాప్యం జరుగుతుండటంతో తరగతుల ప్రారంభం ఆలస్యమవుతోంది. దీంతో విద్యా సంవత్సరంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి నిర్ణీత వ్యవధిలోనే (జూలై) తరగతులను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. దీంతోపాటు ఎన్‌ఐటీ, ఐఐటీ, ట్రిపుల్‌ఐటీలకు వేర్వేరుగా ప్రవేశాల కౌన్సెలింగ్ చేపట్టడం వల్ల సీట్లు మిగిలిపోతుండటంతో అలా జరగకుండా ఒకేసారి కౌన్సెలింగ్ నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంకులను ముందస్తుగా వెల్లడించేందుకు మంగళవారం షెడ్యూలు ప్రకటించింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ముందుగా ఇచ్చిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 4న ఆఫ్‌లైన్, 10, 11 తేదీల్లో జరిగిన ఆన్‌లైన్ పరీక్షల్లో విద్యార్థుల స్కోర్‌ను ఏప్రిల్ 27న ప్రకటించింది. ఆల్ ఇండియా ర్యాంకులను జూలై 7న వెల్లడించాల్సి ఉంది. అయితే ఉమ్మడి కౌన్సెలింగ్ నేపథ్యంలో జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంకులను జూన్ 24నే ప్రకటించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇటీవల జేఈఈ మెయిన్‌కు చెందిన సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు, జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు చెందిన జాయింట్ అడ్మిషన్ బోర్డు సంయుక్తంగా జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీగా ఏర్పడి ఉమ్మడి కౌన్సెలింగ్‌కు చర్యలు చేపట్టాయి. ఈనెల 24న నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఆల్ ఇండియా ర్యాంకులను జూన్ 18న ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నాయి. మరోవైపు జూన్ 24న జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంకులను కూడా వెల్లడించి, 25వ తేదీ నుంచే విద్యార్థుల నుంచి ఆప్షన్ల నమోదుకు చర్యలు చేపట్టింది. మొత్తానికి జూలై 16 నుంచి ఐఐటీల్లో, 23 నుంచి ఎన్‌ఐటీల్లో తరగతులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది.
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష షెడ్యూలు
ఇదీ సీట్ల కేటాయింపు షెడ్యూలు
ఇదీ ఐఐటీ ప్రవేశ అర్హత విధానం
ఐఐటీల్లో సీటు పొందాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆల్ ఇండియా ర్యాంకుతోపాటు అర్హత పరీక్ష అయిన 12వ తరగతి/ఇంటర్మీడియట్ బోర్డులో టాప్-20 పర్సంటైల్‌లో ఉండాలి. లేదా అర ్హత పరీక్షలో 75 శాతం (జనరల్), ఓబీసీ, 70 శాతం (ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు) మార్కులు సాధించి ఉండాలి. ఈ రెండింటిలో ఏ ఒక్క నిబంధనకు అర్హత సాధించినా ఐఐటీలో చేరేందుకు అర్హులే. ఆ విద్యార్థి సాధించిన ర్యాంకు ఆధారంగా సీట్లు కేటాయింపు ఉంటుంది.
ఇదీ ఎన్‌ఐటీలో ప్రవేశాల విధానం
విద్యార్థి జేఈఈ మెయిన్‌లో సాధించిన స్కోర్‌కు 60 శాతం వెయిటేజీ, 12వ తరగతి/ఇంటర్మీడియట్ సాధించిన మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇచ్చి సదరు విద్యార్థి ఆల్ ఇండియా తుది ర్యాంకును ఖరారు చేస్తారు. విద్యార్థి చాయిస్‌ను బట్టి, తుది ర్యాంకు ఆధారంగా ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో సీట్లను కేటాయిస్తారు. ఏ రాష్ట్రంలో ఎన్‌ఐటీ ఉన్నా.. ఆ రాష్ట్ర బోర్డు నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన విద్యార్థులకే హోమ్‌స్టేట్ కోటా కింద 50 శాతం సీట్లను కేటాయిస్తారు.

- ఈనెల 7 వరకు: ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్
- మే 11-14 వరకు: హాల్ టికెట్ల (అడ్మిట్ కార్డు) డౌన్‌లోడ్
- మే 24: రాత పరీక్ష (ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపరు-1, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పేపరు-2)
- జూన్ 8: ఆన్‌లైన్‌లో జవాబుల కీ
- 8 -11 వరకు: జవాబుల కీపై అభ్యంతరాలు స్వీకరణ
- 13: మార్కుల విడుదల
- 18: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆల్ ఇండియా ర్యాంకులు ప్రకటన
ఇదీ సీట్ల కేటాయింపు షెడ్యూలు
- జూన్ 24: జేఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంకులు
- 25-29 వరకు: విద్యార్థులు కాలేజీలను ఎంచుకునేందుకు ఆప్షన్లు (చాయిస్)
- 28: ఆప్షన్లను బట్టి మాక్ సీట్ అలొకేషన్ ప్రదర్శన
- 30: ఐఐటీ/ఎన్‌ఐటీల్లో సీట్ల కేటాయింపు, పరిశీలన
- జూలై 1: మొదటి దశ సీట్లు కేటాయింపు ప్రకటన
- 2-6 వరకు: విద్యార్థుల నుంచి అంగీకారం తీసుకోవడం
- 7: భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్లు ప్రకటన. రెండో దశ సీట్ల కేటాయింపు
- 8-11 వరకు: విద్యార్థుల అంగీకారం తీసుకోవడం
- 12: భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్ల వివరాల ప్రకటన. మూడో దశ సీట్లు కేటాయింపు
- 13 -15 వరకు: విద్యార్థుల అంగీకారం తీసుకోవడం
- 16 నుంచి: ఐఐటీల్లో తరగతులు ప్రారంభం. భర్తీ అయిన, మిగిలిన సీట్ల వివరాల ప్రకటన. నాలుగో దశ సీట్లు కేటాయింపు
- 17- 20 వరకు: విద్యార్థుల నుంచి అంగీకారం తీసుకోవడం
- 23 నుంచి: ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో తరగతుల ప్రారంభం
ఇదీ ఐఐటీ ప్రవేశ అర్హత విధానం
ఐఐటీల్లో సీటు పొందాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆల్ ఇండియా ర్యాంకుతోపాటు అర్హత పరీక్ష అయిన 12వ తరగతి/ఇంటర్మీడియట్ బోర్డులో టాప్-20 పర్సంటైల్‌లో ఉండాలి. లేదా అర ్హత పరీక్షలో 75 శాతం (జనరల్), ఓబీసీ, 70 శాతం (ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు) మార్కులు సాధించి ఉండాలి. ఈ రెండింటిలో ఏ ఒక్క నిబంధనకు అర్హత సాధించినా ఐఐటీలో చేరేందుకు అర్హులే. ఆ విద్యార్థి సాధించిన ర్యాంకు ఆధారంగా సీట్లు కేటాయింపు ఉంటుంది.
ఇదీ ఎన్‌ఐటీలో ప్రవేశాల విధానం
విద్యార్థి జేఈఈ మెయిన్‌లో సాధించిన స్కోర్‌కు 60 శాతం వెయిటేజీ, 12వ తరగతి/ఇంటర్మీడియట్ సాధించిన మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇచ్చి సదరు విద్యార్థి ఆల్ ఇండియా తుది ర్యాంకును ఖరారు చేస్తారు. విద్యార్థి చాయిస్‌ను బట్టి, తుది ర్యాంకు ఆధారంగా ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో సీట్లను కేటాయిస్తారు. ఏ రాష్ట్రంలో ఎన్‌ఐటీ ఉన్నా.. ఆ రాష్ట్ర బోర్డు నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన విద్యార్థులకే హోమ్‌స్టేట్ కోటా కింద 50 శాతం సీట్లను కేటాయిస్తారు.
Published date : 06 May 2015 11:51AM