‘ఈసెట్’ తొలి దశ సీట్ల కేటాయింపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ పూర్తి చేసిన అభ్యర్థులు ఇంజనీరింగ్, ఫార్మసీ రెండో సంవత్సరంలో ప్రవేశాలు పొందేందుకు నిర్వహించిన తెలంగాణ ఈసెట్-2018లో అర్హులకు తొలి దశ సీట్ల కేటాయింపు పూర్తయింది.
జూన్ 28 వరకు జరిగిన వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొన్న అభ్యర్థులకు జూలై 2న సీట్లు కేటాయించారు. ఈసెట్‌లో మొత్తం 24,746 మంది అర్హత సాధించగా, ధ్రువ పత్రాల పరిశీలనకు 15,616 మంది హాజరయ్యారు. వీరిలో 15,479 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. మొత్తం 19,039 సీట్లకు గాను మొదటి విడతలో 11,919 మందికి వివిధ కాలేజీల్లో సీట్లు దక్కాయి. ఇక, ఖాళీగా ఉన్న 7,120 సీట్ల భర్తీకి రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనుంది. సీట్లు సాధించిన విద్యార్థులు వారి యూజర్ ఐడీ ద్వారా వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి్య అలాట్‌మెంట్ ఆర్డర్‌ను పొందాలి. అనంతరం జూలై 6లోగా ధ్రువపత్రాల జిరాక్స్ సెట్‌ను కాలేజీలో సమర్పించి అడ్మిషన్ పొందటంతో పాటు వెబ్‌సెట్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేస్తేనే రెండో విడత వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు వారు అర్హులని ఈసెట్ కన్వీనర్ నవీన్‌మిట్టల్ తెలిపారు. జూలై 9 నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు.
Published date : 03 Jul 2018 01:24PM