ఈనెల 30 నుంచి గేట్ పరీక్షలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్టు ఇన్ ఇంజనీరింగ్ (గేట్-2016) పరీక్షలు ఈనెల 30 నుంచి ప్రారంభం కానున్నాయి.
మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని వివిధ జాతీయస్థాయి ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్ సంస్థల్లోని పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి గేట్ పరీక్ష నిర్వహించనున్నారు. గేట్‌లో ఉత్తీర్ణులైన వారికి ఎంహెచ్చార్డీ తదితర ప్రభుత్వ స్కాలర్‌షిప్పులతో సహ పీజీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. ఈ పరీక్షలో అర్హత సాధించి మంచి స్కోరింగ్ కలిగిన వారికి ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) నియామకాల్లో ప్రాధాన్యత కూడా ఉంటుంది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) నిర్వహిస్తున్న ఈ పరీక్షలు ఈనెల 30 నుంచి ఫిబ్రవరి ఏడో తేదీ వరకు కొనసాగుతాయి. పరీక్ష షెడ్యూల్ వివరాలను ‘‘ www.gateiisc.in ’’ వెబ్‌సైట్లో పొందుపరిచారు.
Published date : 08 Jan 2016 02:03PM